మీ ఐబ్రోస్ చాలా పల్చగా ఉన్నాయా.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఒత్తుగా మార్చుకోండిలా!

ఐబ్రోస్ నల్లగా, ఒత్తుగా ఉంటే ముఖం మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తుంది.అందుకే ఒత్తయిన ఐబ్రోస్( Thick eyebrows )కోసం చాలా మంది ఆరాటపడుతుంటారు.

 Follow This Simple Remedy For Thick Eyebrows , Thick Eyebrows, Eyebrows ,-TeluguStop.com

కానీ కొందరిలో ఐబ్రోస్ గ్రోత్ అనేది అస్సలు ఉండదు.దీని కారణంగా ఐబ్రోస్ పల్చగా మారిపోతాయి.

దీంతో పెన్సిల్ తో ఐబ్రోస్ కి మెరుగులు దిద్దుతుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా మరియు వేగంగా ఒత్తయిన ఐబ్రోస్ ను మీ సొంతం చేసుకోవచ్చు.

మరి ఇంతకీ ఆ సింపుల్ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Eyebrows, Eyebrows Oil, Eyebrows Tips, Remedy, Latest, Thick Eyebro

ముందుగా నాలుగు వెల్లుల్లి రెబ్బలను( Garlic cloves ) తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి కచ్చాపచ్చాగా దంచుకోవాలి.ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో అరకప్పు ఆవనూనె ( Mustard oil )వేసుకోవాలి.అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఐదు లవంగాలు ( Cloves )వేసి బాగా కలపాలి.

ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి చిన్న మంటపై ఈ గిన్నెను పెట్టుకుని ఆయిల్ ను నాలుగైదు నిమిషాల పాటు మ‌రిగించాలి.

Telugu Tips, Eyebrows, Eyebrows Oil, Eyebrows Tips, Remedy, Latest, Thick Eyebro

ఆపై ఆయిల్ ను చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక వెల్లుల్లి రెబ్బలు, లవంగాలతో సహా ఆయిల్ ను ఒక బాటిల్ లోకి నింపుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న ఆయిల్ ను ఐబ్రోస్ కి అప్లై చేసి సున్నితంగా రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

అలాగే ఉదయం స్నానం చేయడానికి గంట ముందు కూడా ఈ ఆయిల్ ను ఐబ్రోస్ కు అప్లై చేసుకోవాలి.రోజుకు రెండుసార్లు ఈ ఆయిల్ ను వాడితే ఐబ్రోస్ గ్రోత్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.

కొద్దిరోజుల్లోనే మీ పల్చటి ఐబ్రోస్ ఒత్తుగా మారతాయి.కాబట్టి పల్చటి ఐబ్రోస్ తో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ ఆయిల్ ను వాడేందుకు ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube