దేవరగట్టు కర్రల సమరంలో 50 మందికి పైగా గాయాలు... బాలుడు మృతి..

మన భారతదేశంలో దసరా పండుగ సమయాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకాల కార్యక్రమాలను ప్రజలు చేస్తూ ఉంటారు.దసరా రోజున శ్రీ మాళ మల్లేశ్వర స్వామి వేడుకల్లో భాగంగా జరిగే ఈ కర్రల సమరం ఈ ఏడాది వర్షం కారణంగా కాస్త ఆలస్యం అయింది.

 More Than 50 People Injured In Devaragattu Stick Fight , Devaragattu , Kurnool-TeluguStop.com

ఈ ఏడాది నిర్వహించిన కర్రల సమరంలో 50 మంది భక్తులు గాయపడ్డారు.అంతేకాకుండా, ఆ మార్గంలో భారీగా వాహన రాకపోకలు నిలిచిపోవడంతో పాటు, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం జరిగింది.

ఈ దసరా పండుగ సందర్భంగా కర్రల సమరానికి వెళ్తుండగా ఒక బాలుడు మృతి చెందాడు.కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని జైత్రయాత్రకు ఎంతో ప్రత్యేకత ఉంది.

దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై మాల మల్లేశ్వర స్వామి ఆలయం ఉంది.ఈ దసరా పండుగ సందర్భంగా స్వామివారిని దక్కించుకోవడానికి నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓవైపు, అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్ లాంటి గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు.

అయితే ఈ సంవత్సరం జరిగిన ఈ యుద్ధంపై స్థానికులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు.అనుకున్నట్టుగానే హింస జరిగింది.ఇటువంటి ఘోరమైన యుద్ధంలో తలలు పగులుతాయని అంతకుముందే మానవ హక్కుల కమిషన్ బాగా సీరియస్ అయింది.అంతేకాకుండా కర్నూలు కలెక్టర్, ఎస్పీలకు కూడా నోటీసులు జారీ చేసింది.

ఈ ఉత్సవం దసరా, ఆ తర్వాతి రోజు తెల్లవారి జామున వరకు జరుగుతాయి.వంద సంవత్సరాల కిందట దేవరగట్టులో వెలిసిన మాళ మల్లేశ్వర స్వామి కళ్యాణం తర్వాత విగ్రహాలను సొంతం చేసుకునేందుకు ఆ ప్రాంత పరిసరాల్లో ఉన్న 12 గ్రామాల ప్రజలు రెండు విభాగాలుగా విడిపోయి కర్రలతో చేసేదే ఈ యుద్ధం.

ఈ ఉత్సవంలో కొంతమంది ప్రజలు కర్రలకు ఇనుప చువ్వను బిగించి ఈ కర్రల యుద్ధంలో పాల్గొంటారు.అందువల్ల ఈ ఉత్సవంలో హింసాత్మక గతంలో జరిగే అవకాశం కూడా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube