తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు రంగం సిద్ధం అవుతోంది.కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉండనుందని పార్టీ శ్రేణులు తెలిపారు.
ఈ మేరకు జనవరి 26 నుంచి పాదయాత్ర ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.మొత్తం 99 రూరల్ నియోజకవర్గాల్లో పాదయాత్ర జరగనుంది.
కాగా భద్రాచలం నుంచి యాత్ర మొదలు పెట్టేందుకు రేవంత్ రెడ్డి సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.అయితే పాదయాత్ర షెడ్యూల్ పై ఆయనే స్వయంగా కసరత్తు చేస్తున్నారు.
ఈ క్రమంలో పాదయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నారు.