1.దివ్యాంగులకు సదరన్ సర్టిఫికెట్ల పంపిణీ
హైదరాబాద్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులో కాంప్లెక్స్ లలో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, మెట్రో పాలెం న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ తిరుమల దేవి సోమవారం దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.
2.ప్రతి నియోజకవర్గంలో మనబస్తి – మనబడి పనులు ప్రారంభం
ఈనెల తొమ్మిదో తేదీ నుంచి హైదరాబాద్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో మనబస్తి – మనబడి పనులు ప్రారంభమవుతాయని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
3.పీకే రాజకీయ పార్టీ ప్రకటన వెనుక కేసీఆర్
ప్రశాంత్ కిషోర్ రాజకీయ అరంగ్రేటం పై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం స్పందించారు.ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారని కోదండరాం వ్యాఖ్యానించారు.
4.చంచల్గూడా జైలు ను కలిసిన రేవంత్ రెడ్డి
చంచల్ గూడ జైలు నుండి టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం కలిశారు.జైలులో ఉన్న విద్యార్థులను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలవడానికి ములాకత్ కోసం జైలర్ కు కాంగ్రెస్ నేతలు వినతిపత్రం ఇచ్చారు.
5.ఇంటర్ పరీక్షలు
ఈనెల ఆరో తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని, విద్యార్థులు సోమవారం నుంచి వెబ్ సైట్ లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని, వీటిపై ఎలాంటి సంతకాలు అవసరం లేదని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ పేర్కొన్నారు.
6.రాఘవ రెడ్డికి టి పిసిసి క్రమశిక్షణా సంఘం నోటీసులు
డిసిసి అధ్యక్షుడు రాఘవ రెడ్డికి పిసిసి క్రమశిక్షణా సంఘం నోటీసులు జారీ చేసింది.జిల్లా పరిధి దాటి హనుమకొండలో కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ నోటీసు ఇచ్చారు.
7.రైసు మిల్లుల పై ఎఫ్ సీ ఐ దాడులు
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లులపై ఎఫ్సిఐ అధికారులు దాడులు నిర్వహించారు.కష్టం బిల్లింగ్ రైస్ ఇవ్వాల్సిన రైసు మిల్లులు గడువు ముగిసినప్పటికీ ధాన్యం ఇవ్వకపోవడంతో ఎఫ్ సి సోదాలు చేపట్టింది.
8.కరోనా పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
ప్రస్తుత పాలసీ ప్రకారం ఏ ఒక్కరికి బలవంతంగా వ్యాక్సిన్ వేయడానికి వీలు లేదని సుప్రీం కోర్టు వెల్లడించింది.
9.డిజెపి కి చంద్రబాబు లేఖ
ఏపీలో ఇటీవల చోటు చేసుకున్న నేరాలపై ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు డీజీపీ కి లేఖ రాశారు.
10.బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో పోస్టుల భర్తీ
కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.ఈనాడు స్టేషన్ ద్వారా మొత్తం 276 పోస్టులను భర్తీ చేయనున్నారు.
11.కోల్కతాలోని సి ఎస్ ఐ ఆర్ సీజీసీఆర్ లో పోస్టుల భర్తీ
కోల్కతాలోని సి ఎస్ ఐ ఆర్ సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు మొత్తం ఈ పోస్టులు ద్వారా 32 టెక్నీషియన్ , 36 టెక్నికల్ అసిస్టెంట్లు పోస్టుల భర్తీ చేయనున్నారు.
12.ఓ ఎన్ జి సి ఎం ఆర్ పి ఎల్ లో ఉద్యోగాల భర్తీ
భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఓ ఎన్ జి సి లిమిటెడ్ సబ్సిడరీ సంస్థ అయిన మంగుళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నరు మొత్తం 65 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
13.పత్తి , సోయాబీన్ సాగుపై దృష్టి పెట్టాలి
తెలంగాణలో తొలి ప్రాధాన్యం వ్యవసాయ రైతులు ఈ సారి పత్తి, సోయాబీన్ సాగు మీద దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
14.కృష్ణా జిల్లాలో ఎస్ ఎస్ సి పరీక్షల్లో అవకతవకలు.విచారణ ప్రారంభించిన విద్యాశాఖ
కృష్ణా జిల్లా పామర్రు మండలం పసుమర్రు జిల్లా పరిషత్ పాఠశాలలో ఎస్ఎస్సి పరీక్షల్లో అవకతవకలు చోటు చేసుకోవడం కలకలం రేపింది.దీనిపై విద్యాశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు.
15.రాహుల్ సభ పై రేవంత్ రెడ్డి కామెంట్స్
టిఆర్ఎస్ ఒత్తిడితోనే రాహుల్ పర్యటనకు ఓయూ అధికారులు అనుమతి నిరాకరించారు అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి విమర్శించారు.
16.రేపల్లె ఘటనపై హోంమంత్రి కామెంట్స్
రేపల్లె ఘటనలో పోలీసులు వెంటనే స్పందించారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు.
17.కొత్త పార్టీ పేరు ప్రకటించిన ప్రశాంత్ కిషోర్
ప్రముఖ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ పేరు ప్రకటించారు.
18.ఫ్రాంక్ వీడియో తో ప్రచారం.నటుడి పై ఫిర్యాదు
సినిమా ప్రచారం పేరిట ప్రాంక్ వీడియో తో న్యూసెన్స్ క్రియేట్ చేశారంటూ సినీ హీరో విశ్వక్ సేన్ పై ఓ శంకు ఫిర్యాదు చేశారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,200 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,510
.