టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ను ఇటీవల అనౌన్స్ చేయగా ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
కాగా ఈ సినిమా తరువాత మహేష్ చేయబోయే సినిమా ఏమిటా అనే సందేహానికి జక్కన్న రూపంలో చెక్ పడింది.
గతంలోనే మహేష్‌తో రాజమౌళి ఓ సినిమా చేయాల్సి ఉండగా అది ఎందుకో కుదరలేదు.
కాగా ఇటీవల మహేష్‌తో తన నెక్ట్స్ చిత్రం ఉంటుందని జక్కన్న తెలిపాడు.దీంతో ఈ కాంబోలో తెరకెక్కే సినిమా ఎలాంటి జోనర్‌కు చెందిందా అనే సందేహం అందరిలో నెలకొంది.
ఇక మహేష్‌కు హిస్టారికల్ కథలు సెట్ కావని కొందరు భావిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లాంటి పీరియాడికల్ చిత్రం తరువాత జక్కన్న ఓ కమర్షియల్ సినిమా చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడట.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అనుకూలంగా ఉండే కథలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండేలా జాగ్రత్త పడతున్నాడట జక్కన్న.అంటే మహేష్ ఎలాంటి ప్రయోగాలు చేయకుండా సాధారణమైన కథతో మనముందుకు రావడానికి రెడీ అవుతున్నాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఇక ఈ సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తారా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.కాగా సర్కారు వారి పాట చిత్రంలో మహేష్ ఆర్థిక నేరాల కథను మనకు చూపించేందుకు రెడీ అవుతున్నాడు.