సినిమా సందడి అంతా ఆగస్టులోనే.. అంతా అదిరి పోవడం ఖాయం

సాదారణంగా సమ్మర్ లో టాలీవుడ్ సినిమా ల సందడి ఉంటుంది.కాని ఈసారి కరోనా వల్ల సమ్మర్ సీజన్ కాస్త డల్ గా నడిచింది.

 Tollywood Movies Coming Back To Back In August , Film News , News In Telugu ,-TeluguStop.com

కొన్ని సినిమాలు విడుదల అయినా జనాలు పెద్దగా పట్టించుకోలేదు.కొన్ని సినిమాలకు పర్వాలేదు అన్నట్లుగా టాక్ వచ్చింది.

జూన్ నుండి సినిమా ల జోరు మొదలు అయ్యింది.ఈ నెలలో పెద్ద మొత్తం లో సినిమా లు విడుదల అయిన విషయం తెల్సిందే.

ఇక జూలై లో కూడా భారీ సంఖ్య లో సినిమా లను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటనలు వచ్చాయి.ఇక ఆగస్టు లో సినిమాల జోరు మామూలుగా లేదు.

పెద్ద సినిమాలు.మీడియం రేంజ్ సినిమా లు చాలా వరకు ఆగస్టు లో రాబోతున్నాయి.

అదుగో ఇదుగో అంటూ వాయిదాల మీద వాయిదాలు పడ్డ సినిమా లు అన్నీ కూడా ఆగస్టు లో విడుదల కాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.అధికారికంగా ఇప్పటికే దాదాపుగా పది సినిమా ల తేదీలు ఖరారు అయ్యాయి.

మరి కొన్ని సినిమా లు కూడా విడుదల అయ్యేందుకు ఆగస్టు ను ఎంపిక చేసుకుంటున్నాయి.ఆగస్టు లో పెద్ద హీరోల సినిమా లతో పాటు మోస్ట్‌ క్రేజీ చిన్న హీరోల సినిమా లు కూడా రాబోతున్నాయి.

కనుక ఖచ్చితంగా ఆగస్టు లో టాలీవుడ్‌ బాక్సాఫీస్ అదిరి పోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇదే సమయంలో సినిమా లు క్లాష్‌ కాకుండా జాగ్రత్త పడుతూ విడుదల తేదీలను ప్లాన్‌ చేసుకోవడం చాలా ముఖ్యం అంటూ సినీ విశ్లేషకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.

 ఆగస్టు లో రాబోతున్న సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్ జాతర జూలై మొదటి లేదా రెండవ వారం నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube