లాంగ్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ ను అందించే బెస్ట్ రెమెడీ ఇది.. తప్పక ట్రై చేయండి!

అందాన్ని పెంచే వాటిలో కురులు ఒకటి.అందుకే చర్మం తో పాటు జుట్టు( Hair ) సంరక్షణకు కూడా చాలా అవసరం.

 This Is The Best Remedy For Long And Strong Hair , Long Hair, Strong Hair ,-TeluguStop.com

లేదంటే రకరకాల జుట్టు సమస్యలు వేధిస్తుంటాయి.అయితే మనలో చాలా మంది లాంగ్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ ( Long and strong hair )కోసం ఆరాటపడుతుంటారు.

కానీ అటువంటి జుట్టును పొందడం ఎలాగో తెలియక మదన పడుతుంటారు.మీరు ఈ లిస్టులో ఉన్నారా.

‌.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని మీరు తప్పక ట్రై చేయాల్సిందే.ఈ రెమెడీతో సులభంగా లాంగ్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ ను పొందవచ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

ముందుగా ఒక చిన్న ఉల్లిపాయ ( Onion )ని తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, రెండు రెబ్బలు కరివేపాకు, ( Curry leaves )వన్ టేబుల్ స్పూన్ మెంతులు ( Fenugreek )మరియు అరకప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె( Coconut oil) వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె వేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు దూది సహాయంతో ఈ జ్యూస్ ను స్కాల్ప్ కు బాగా అప్లై చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ విధంగా చేస్తే హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.దాంతో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.లాంగ్ అండ్ థిక్ హెయిర్ మీ సొంతం అవుతుంది.

పైగా చుండ్రు సమస్యతో బాధపడే వారికి కూడా ఈ రెమెడీ సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube