సబ్ వేలో మహిళ సజీవ దహనం.. న్యూయార్క్ గవర్నర్ రాజీనామాకు ఎలాన్ మస్క్ డిమాండ్

అమెరికాలో అక్రమ వలసదారుల కారణంగా శాంతి భద్రతల సమస్యలు చోటు చేసుకుంటున్నాయి.అక్రమంగా బోర్డర్ దాటుతున్న వారిలో కరడుగట్టిన నేరస్థులు కూడా ఉంటూ.

 New York Gov Kathy Hochul Faces Calls To Resign After Illegal Migrant Setting Wo-TeluguStop.com

దోపిడీలు, హత్యలు, దాడులు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమ వలసదారుల అంశం తీవ్రంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

తాజాగా న్యూయార్క్ సబ్ వేలో( New York Subway ) ఓ గ్వాటెమాల వలసదారుడు.మహిళపై నిప్పంటించి, ఆమె తగలబడుతుంటే వేడుక చూసిన ఘటనతో అమెరికాతో పాటు ప్రపంచం ఉలిక్కిపడింది.

న్యూయార్క్ సబ్ వే ఘటనతో ఆ రాష్ట్ర గవర్నర్ కాథీ హోచుల్‌పై( Governor Kathy Hochul ) రాజకీయ విమర్శలు ఎక్కువయ్యాయి.ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందిగా పలువురు ఆమెను డిమాండ్ చేస్తున్నారు.

నిందితుడు సెబాస్టియన్ జపెటా కాలిన్ (33)పై ( Sebastian Zapeta Calil ) ఫస్ట్ డిగ్రీ హత్య, మనిషిని దహనం చేసినందుకు పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.అయితే హోచుల్‌ను రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్న వారిలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్( Elon Musk ) కూడా ఉన్నారు.

మహిళ హత్యకు గురైన రోజే సబ్ వేలలో భద్రతను మెరుగు పరిచినట్లుగా హోచుల్ ఓ పోస్ట్ పెట్టడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Telugu Elon Musk, Governorkathy, Migrant, Yorkgov, York Subway, Nyc Subway, Resi

సబ్ వేలను సురక్షితమైనవిగా మార్చేందుకు క్యాథీ హోచుల్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారని.కానీ అదే రోజు క్వీన్స్‌లో ఇద్దరు సబ్ వే ప్రయాణీకులు కత్తిపోట్లకు గురయ్యారని, ఓ మహిళ సజీవ దహనమైందని ప్రతినిధుల సభ సభ్యుడు రిట్చీ టోర్రెస్ ట్వీట్ చేశారు.ఈ పోస్ట్‌పై స్పందించిన ఎలాన్ మస్క్.

తక్షణం క్యాథీ హోచుల్‌ను రీకాల్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.

Telugu Elon Musk, Governorkathy, Migrant, Yorkgov, York Subway, Nyc Subway, Resi

బ్రూక్లీన్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడు డోవ్ హికిండ్ సైతం .న్యూయార్క్ సబ్ వేలో జరిగిన విషాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ హోచుల్‌ రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.

ఈ బాధ్యతలు మీరు నిర్వర్తించలేరని.దురదృష్టవశాత్తూ న్యూయార్క్ చరిత్రలో గవర్నర్‌ను రీకాల్ చేసిన దాఖలాలు లేవని కాబట్టి మీరే సరైన నిర్ణయం తీసుకోవాలని హికిండ్ హితవు పలికారు.

ఈ పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.పలువురు నెటిజన్లు గవర్నర్‌ను రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube