రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం.వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.
ముఖ్యంగా సాయి పల్లవి తన నటన ద్వారా అందరినీ మరోసారి ఫిదా చేసింది.జూన్ 17వ తేదీ ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకుందని చెప్పాలి.1990లో జరిగిన యదార్థ సంఘటనకు ప్రేమను జోడించి మహా ప్రేమకావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.
ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
ఇలా పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా థియేటర్ లో కాకుండా డైరెక్టుగా డిజిటల్ స్క్రీన్ పై విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ఈ సినిమా థియేటర్లో విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.ఇలా థియేటర్ లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

విరాట పర్వం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు కొనుగోలు చేశారు.ఈ క్రమంలోనే ఈ సినిమా థియేటర్లో నాలుగు వారాలు పూర్తి చేసుకున్న తర్వాత డిజిటల్ స్క్రీన్ పై ప్రసారం కానుంది.నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఒక అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాలుగు వారాల అనంతరం ఓటీటీలో విడుదల చేయాలని వెంకటేష్ భావించారట.ఇక ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ తో పాటు ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.







