వారంలో రెండు సార్లు ఈ నూనెను రాసుకుంటే తెల్ల జుట్టుకు దూరంగా ఉండవచ్చు!

ఇటీవల రోజుల్లో ఎక్కువ శాతం మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యను ఫేస్ చేస్తున్నారు.ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి.

 If You Apply This Oil Twice A Week, You Can Avoid White Hair! Hair Oil, Oil, Lat-TeluguStop.com

ముఖ్యంగా పెరిగిన కాలుష్యం, ఆహారపు అలవాట్లు, రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను వాడటం, ధూమపానం, మద్యపానం వంటి వాటి వల్ల మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది.మెలనిన్ ఉత్పత్తి తగ్గితే జుట్టు తెల్లబడటం ప్రారంభమవుతుంది.

దాంతో తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే తెల్ల జుట్టు వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం ఎంతో మేలు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ ఆయిల్ ఎంతగానో సహాయపడుతుంది.వారంలో రెండంటే రెండు సార్లు ఈ నూనెను రాసుకుంటే తెల్లజుట్టుకు దూరంగా ఉండవచ్చు.మెలనిన్ ఉత్పత్తిని అద్భుతంగా మెరుగుపరుచుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ నూనెను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Black, Care, Care Tips, Fall, Oil, Latest, White-Telugu Health Tips

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనె వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ శీకాకై పౌడర్, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్‌ పౌడర్ వేసుకుని మీడియం ఫ్లేమ్ పై ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పల్చటి వస్త్రం సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకోవాలి.

Telugu Black, Care, Care Tips, Fall, Oil, Latest, White-Telugu Health Tips

ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ఈ ఆయిల్ ను అప్లై చేసుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్‌ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారంలో రెండుసార్లు ఈ విధంగా చేస్తే మెల‌నిన్ ఉత్పత్తి అద్భుతంగా పెరుగుతుంది.దాంతో జుట్టు త్వరగా తెల్ల బ‌డకుండా ఉంటుంది.

అంతేకాదు ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి.దాంతో హెయిర్ ఫాల్ సమస్య సైతం అదుపులోకి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube