విదేశాల్లో జన్మించినప్పటికి భార‌త్‌ కోసం క్రికెట్ ఆడిన ఆటగాళ్లు వీరే..!

అవకాశాలు ఎక్కడ ఉంటే జనాలు అక్కడికి వెళ్తారు.చాలా మంది భారతీయులు ఇతర దేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడుతున్నారు.

 Indian Cricketers Who Born In Other Countries , Indian Cricketers, Born In Other-TeluguStop.com

అలాగే ఇతర దేశాల్లో పుట్టిన వారు ఇండియాలోనూ పౌరసత్వం పొంది ఉంటున్నారు.అలాగే విదేశాల్లో పుట్టి భారత్ తరఫున క్రికెట్ ఆడిన వారు చాలా మంది ప్లేయర్లు ఉన్నారు.

ఇంతకీ ఇండియా తరుపున ఆడిన ఆ విదేశీ క్రికెటర్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రాబిన్ సింగ్
ఇతడు పుట్టింది వెస్టిండీస్ దేశంలో.

ట్రినిడాడ్ అంట్ టొబాగో సమీపంలో ఉన్న ప్రిన్సెస్ టౌన్‌లో రాబిన్ సింగ్ జ‌న్మించాడు.ఇతడు భారత్ తరఫున 136 వ‌న్డేలు ఆడాడు.

ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు.జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

సలీమ్ దురానీ

Telugu Ashok Gandotra, Born, Foreigncrickets, Khokhan Sen, Lall Singh, Robin Sin

సలీమ్ దురానీ అప్ఘనిస్థాన్ లోని కాబూల్ లో జన్మించాడు.1934లో పుట్టిన ఈ ఆల్ రౌండర్.భారత్ నుంచి 29 టెస్టులు ఆడాడు.తన కెరీర్ లలో 1,202 రన్స్ చేశాడు.వీటిలో ఒక సెంచరీ ఉంది.75 వికెట్లు పడగొట్టాడు.

ఖోఖన్ సేన్

Telugu Ashok Gandotra, Born, Foreigncrickets, Khokhan Sen, Lall Singh, Robin Sin

బంగ్లాదేశ్ లో పుట్టిన ఖోఖన్ సేన్ భారత్ నుంచి 14 టెస్టులు ఆడాడు.165 పరుగులు చేశాడు.ఇతడిని ప్రొబిర్ కుమార్ సేన్ అని కూడా పిలుస్తారు.

లాల్ సింగ్

Telugu Ashok Gandotra, Born, Foreigncrickets, Khokhan Sen, Lall Singh, Robin Sin

మలేషియాలో పుట్టిన లాల్ సింగ్ టీమిండియా తరుపున ఒక టెస్టు ఆడాడు.1932లో ఇంగ్లండ్‌తో ఆడిన మ్యాచ్ లో బరిలో దిగాడు.44 ప‌రుగులు చేశాడు.

అశోక్ గండోత్రా

Telugu Ashok Gandotra, Born, Foreigncrickets, Khokhan Sen, Lall Singh, Robin Sin

ఇతడు బ్రెజిల్ లో జన్మించాడు.భారత క్రికెట్ టీం నుంచి రెండు టెస్టులు ఆడాడు.54 పరుగులు చేశాడు ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లు 54 ఆడాడు ఢిల్లీ, బెంగాల్ టీంల‌కు క్రీడాకారుడిగా కొనసాగాడు.అనంతరం క్రికెట్ నుంచి వైదొలిగాడు.

అటు భారత్ కు చెందిన చాలా మంది ప్లేయర్లు విదేశీ క్రికెట్ టీములకు ఆడినవారు ఉన్నారు.అక్కడ తమ ఆటతో మంచి గుర్తింపును సైతం పొందారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube