వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఆనందం నెలకొనాలంటే కొన్ని నియమాలు పాటించాలి.ఇటువంటివాటిని విస్మరించడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడతాయి.
ముఖ్యంగా వ్యాపారంలో విజయం సాధించాలంటే మీ కార్యాలయంలో వీటిని తప్పకుండా ఉంచుకోవాలి.అప్పుడే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1 వెదురు మొక్క:
వాస్తు ప్రకారం కార్యాలయంలోని టేబుల్‌పై వెదురు మొక్కను ఉంచడం వల్ల వ్యాపారంలో పురోగతికి అవకాశం ఏర్పడుతుంది.దానిని ఉంచడం వలన మీకు శుభం చేకూరుతుంది.
2 తాబేలు:
వాస్తు ప్రకారం ఇంటితో పాటు కార్యాలయంలో లోహంతో చేసిన తాబేలు ఉంచడం చాలా శుభప్రదం.ఆఫీసు కోసం ప్రత్యేక రకం తాబేలు తయారు చేస్తారు.ఇది వ్యాపారంలో వృద్ధికి దోహదపడుతుంది.
3 క్రిస్టల్ చెట్టు: క్రిస్టల్ చెట్టును ఆఫీసులో ఉంచితే ఆ కార్యాలయంలో ఆగిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభమవుతాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతుంటారు.వ్యాపారాన్ని వేగవంతం చేయడంలో క్రిస్టల్ ట్రీ సహాయపడుతుందని నమ్ముతారు.
4 లాఫింగ్ బుద్ధ: లాఫింగ్ బుద్ధ చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.కార్యాలయంలో దీనిని ఉంచితే సానుకూల వాతావరణం నెలకొంటుందని చెబుతారు.
అదృష్టం కూడా పెరుగుతుందని చెబుతారు.కార్యాలయంలో బంగారు నాణేలతో కూడి ఓడ బొమ్మను కూడా పెట్టుకోవచ్చు.
ఇది వ్యాపారంలో ఆర్థిక బలాన్ని తీసుకువస్తుంది.ఇతర ఆదాయ వనరులకు అవకాశం కల్పిస్తుంది.