మన దేశంలో చాలా మంది ప్రజలు రాశి ఫలాలను బలంగా నమ్ముతారు.కానీ కొంత మంది ఈ రాశి ఫలాలను అసలు పట్టించుకోరు.
ముఖ్యంగా చెప్పాలంటే రాశి ఫలాలు( Rashi Phalalu ) అంటే గ్రహాలు, వాటి స్థానాలు అని దాదాపు చాలా మందికి తెలుసు.అలాగే గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటూ ఉంటాయన్న విషయం దాదాపు చాలా మందికి తెలుసు.
ఇలా మారినప్పుడు కొన్ని రాశుల వారికి సానుకూలంగానూ, మరి కొన్ని రాశుల వారికి ప్రతికూలంగానూ ఉంటుంది.అయితే శని దేవుడు( Shanidev ) ప్రస్తుతం తన స్వస్థలమైన కుంభ రాశి( Aquarius )లో సంచారం చేస్తూ ఉన్నాడు.

కొద్ది రోజుల క్రితం బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు.దీని ప్రభావం 12 రాశుల వారి పై కచ్చితంగా ఉంటుంది.వారిలో ఈ రాశుల వారికి మార్చి ఆరవ తేదీ వరకు శని, బుధ, రవి కలయిక వల్ల మంచి లాభాలు పొందుతారు.మరి ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే కుంభ రాశిలో శని, సూర్యుడు, రవి కలయిక వల్ల ఏర్పడే యోగం మేష రాశి ( Mesha Rasi )వారికి ఎంతో మేలు జరుగుతుంది.ఇబ్బందులను అధిగమించడానికి ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది.
వ్యాపారంలో మంచి లాభాలు సంపాదించే అవకాశం ఉంది.

ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.అలాగే యజమానులు, సహోద్యోగుల నుంచి మరింత మద్దతు లభిస్తుంది.ఈ సమయంలో విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుంది.
అలాగే ఈ రాశి వారికి వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది.అలాగే కర్కాటక రాశి( Karkataka Rasi ) వారికి రవి, బుధ, శని కలయిక చాలా శుభప్రదం అని చెబుతున్నారు.
సూర్యుని అనుగ్రహంతో విద్యార్థులు చదువు పై ఏకగ్రతతో ఉంటారు.మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అదే సమయంలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు విపరీతంగా పెరుగుతాయి.
LATEST NEWS - TELUGU