మన దేశంలో ఉన్న గరుడ దేవుడి.. ఏకైక దేవాలయం గురించి తెలుసా..?

మన దేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్ లో ఎన్నో సంవత్సరాల పురాతన ఆలయాలు ఉన్నాయి.ఇక్కడ ఉన్న ప్రతి ఆలయానికి ఏదో ఒక చరిత్రక ప్రాముఖ్యత కచ్చితంగా ఉంది.

 Do You Know About The Only Temple Of Lord Garuda In Our Country , Uttarakhand,-TeluguStop.com

ప్రతి ఏడాది ఈ దేవాలయాలకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి భగవంతుని దర్శించుకుంటూ ఉన్నారు.ఇక రిషికేష్ కు పది కిలో మీటర్ల దూరంలో నీలకంఠా మహాదేవ దేవాలయానికి 18 కిలోమీటర్ల దూరంలో పౌరీ జిల్లాలో పురాతన గరుడ దేవాలయం( Garuda Temple ) ఉంది.

ఈ ప్రదేశాన్ని గరుడ చత్తి అని కూడా అంటారు.ఈ గరుడ దేవుని దేవాలయానికి( Lord Garuda ) రావడం ద్వారా ఆ వ్యక్తి జాతకంలో ఉన్న కాలసర్ప దోషం దూరమైపోతుంది అని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

Telugu Temples, Devotees, Devotional, Garuda Temple, Problems, Lord Garuda, Paur

అంతే కాకుండా ఉత్తరఖండ్ లోని గరుడ దేవునికి ఉన్న ఏకైక దేవాలయం ఇదే కావడం మరో విశేషం.ఇక ఈ దేవాలయానికి ఉత్తరఖండ్ తో పాటు చాలా రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు.అలాగే ఎక్కువ మంది ఈ ప్రదేశానికి రావడానికి ఇష్టపడుతున్నారు.ఇంకా చెప్పాలంటే ఈ దేవాలయం సమీపంలో నిర్మించిన చెరువు ఎంతో ప్రసిద్ధి చెందింది.ఈ దేవాలయంలో రంగు రంగుల చేపలు ఆలయాన్ని మరింత అందంగా చూపుతున్నాయి.ఈ చెరువు సాధారణ చెరువు కాదని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

ఈ చెరువు గరుణ్ గంగతో నేరుగా సంబంధం కలిగి ఉందని భక్తులు నమ్ముతున్నారు.

Telugu Temples, Devotees, Devotional, Garuda Temple, Problems, Lord Garuda, Paur

అంతే కాకుండా ఈ చెరువు నీరు మామూలు నీరు కాదని, ఈ చెరువు నీటికీ అనారోగ్య సమస్యలను( Health problems ) దూరం చేసే శక్తి ఉందని భక్తులు నమ్ముతున్నారు.అంతే కాకుండా దీనితో పాటు ఇక్కడి కోనేరులో రకరకాల చేపలు ఉన్నాయి.వాటికి పిండి మాత్రలు,పేడా తినిపించడం వల్ల రాహు దోషం తొలగిపోతుందని భక్తులు చెబుతున్నారు.

దీంతో నిత్యం వేలాది మంది భక్తులు ఈ దేవాలయానికి వచ్చి కోనేరులో స్నానం చేస్తూ చేపలకు ఆహారం అందిస్తూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube