మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే.ఈయన నటి లావణ్య త్రిపాఠిని ( Lavanya Tripati ).
గత కొద్దిరోజులుగా ప్రేమిస్తున్నారు.ఇలా కొన్ని సంవత్సరాలు పాటు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి కుటుంబ సభ్యుల అనుమతితో ఎంతో ఘనంగా వివాహం చేసుకోబోతున్నారు.
ఇప్పటికే పెళ్లి పనులన్నీ కూడా పూర్తి అయ్యాయని తెలుస్తుంది.ఇక వివాహానికి నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండడంతో వరుణ్ తేజ్ లావణ్య అలాగే నిహారిక కూడా ఇటలీ ( Italy ) బయలుదేరి వెళ్లిపోయారని తెలుస్తుంది.
నేడు వరుణ్ లావణ్య త్రిపాఠితో పాటు నిహారిక ( Niharika ) ఇటలీ వెళ్లారని తెలుస్తుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇటలీ వెళ్లడం కోసం వరుణ్ తేజ్ లావణ్య శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక లావణ్య త్రిపాఠి కారు దిగగానే అక్కడ ఉన్నటువంటి ఒక మనిషికి డబ్బులు ఇచ్చి తన మంచి మనసు చాటుకున్నారు అయితే ఆ డబ్బులు ఆయనకు ఇవ్వడంతో తన ముఖంలో చిరునవ్వు చూసి లావణ్య త్రిపాఠి కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఇక వీరి పెళ్లి నవంబర్ ఒకటవ తేదీ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ముందుగానే ఇటలీ చేరుకున్నారని తెలుస్తుంది త్వరలోనే వీరి కుటుంబ సభ్యులందరూ కూడా ఇటలీ వెళ్ళిబోతున్నారు.ఇక తాజాగా వీరి వెడ్డింగ్ రిసెప్షన్ కి సంబంధించినటువంటి ఇన్విటేషన్ కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.నవంబర్ 1వ తేదీ ఇటలీలో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నటువంటి ఈ జంట నవంబర్ 5వ తేదీ హైదరాబాద్ లో సీనియర్ సెలబ్రిటీ లందరికీ గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది.
రిసెప్షన్ కి సినీ సెలెబ్రిటీలు అందరినీ ఆహ్వానించినట్లు సమాచారం.