ప్రతిభ చూపిన విద్యార్థికి కలెక్టర్ అభినందన

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రతిభ చూపిన విద్యార్థి జక్కని హేమంత్ ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Sandeep Kumar Jha ) శనివారం అభినందించారు.

సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన సిరిసిల్ల విద్యార్థి జక్కని హేమంత్, గైడ్ టీచర్ పాకాల శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో తయారుచేసిన పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ ఎగ్జిబిట్ ఇన్స్పైర్ మానాక్ జాతీయ స్థాయికి ఎంపికైంది.

నేతన్నల కష్టాలకు పరిష్కారం చూపేది గా  తయారుచేసిన ఈ ఎగ్జిబిట్ గతంలో పలువురి మన్ననలు పొందింది.

ఎగ్జిబిట్ జాతీయస్థాయికి  ఎంపికవడంతో జిల్లా విద్యాధికారి ఏ రమేష్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ మోతిలాల్ విద్యార్థి హేమంత్ తో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను కలువగా, వారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

జాతీయస్థాయికి ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని కొనియాడారు.

ఈ యూకే ఖైదీ చాలా డేంజరస్.. 50 ఏళ్లుగా జైల్లోనే..?