ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.ఆగస్ట్ 2 వ తేదీ నుంచి రోజువారీ వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది.
అయితే 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆర్టికల్ రద్దును సవాల్ చేస్తూ సుప్రీం ధర్మాసనంలో పిటిషన్లు భారీగా దాఖలు అయ్యాయి.
కాగా పిటిషన్లపై మూడేళ్ల తరువాత సుప్రీంకోర్టు విచారణ చేయనుంది.మరోవైపు రద్దును సమర్థిస్తూ ఇటీవలే కేంద్రం న్యాయస్థానంలో అఫిడవిట్ సమర్పించింది.