ఆషాడమే అడ్డంకి ! పెద్ద ప్లానే వేసిన కేసిఆర్

తెలంగాణ రాజకీయాలు( Telangana politics ) వేడెక్కాయి.ఎన్నికల సమయం దగ్గరపడిన నేపథ్యంలో జనాలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూనే, మరోపక్క చేరికలతో తమ పార్టీలను మరింత బలోపేతం చేసుకునే విధంగా ప్లాన్లు వేస్తున్నాయి.

 Ashad Is The Obstacle! Kcr Made A Big Plan, Kcr, Brs, Brs Party, Telangana Cm, K-TeluguStop.com

ఈ విషయంలో బిజెపి, కాంగ్రెస్ ( BJP , Congress )లు దూకుడు ప్రదర్శిస్తున్నాయి.కాంగ్రెస్ లోని అసంతృప్తి నేతలను చేర్చుకుని మొన్నటి వరకు హడావుడి చేసిన బిజెపి, ఇప్పుడు కాస్త ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండగా,బీఆర్ఎస్, బిజెపిలలోని కీలక నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ ఉండటంతో, ఆ పార్టీలో ఉత్సాహం కనిపించింది.

అయితే ఈ విషయంలో కాస్త వెనకబడినట్లు కనిపించిన బీఆర్ఎస్( BRS ) ఇప్పుడు ఆ విషయంపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.ప్రస్తుతం కాంగ్రెస్, బిజెపిలలోని అసంతృప్త నేతలు చాలామంది ఉన్నారు.

వారంతా తమకు సరైన ప్రాధాన్యం లభించడం లేదనే అసంతృప్తితో ఉన్నారు.

Telugu Brs, Congress, Jagga, Ragunandanrao, Telangana Cm, Telangana-Politics

ఈ క్రమంలోనే వారిని బిఆర్ఎస్ లోకి తీసుకొచ్చే విధంగా కేసిఆర్ కొంతమంది కీలక నాయకులతో ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు.వారు అసంతృప్తి నేతలను గుర్తించి, బుజ్జగించి వారిని బీఆర్ఎస్ లో చేరే విధంగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రస్తుతం ఆషాడమాసం కావడంతో, నాయకులతో చర్చలు జరిపి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

వచ్చే శ్రావణంలో వారందరినీ బీఆర్ఎస్ లో చేర్చుకుని కాంగ్రెస్ బిజెపిలు కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాలనే ప్లాన్ తో కేసీఆర్ ఉన్నారట.ఈ మేరకు కొంతమంది కీలక నాయకులతోనూ కేసీఆర్( KCR ) మంతనాలు చేస్తూ వారిని పార్టీలో చేరే విధంగా ఒప్పిస్తున్నారట.

Telugu Brs, Congress, Jagga, Ragunandanrao, Telangana Cm, Telangana-Politics

ప్రస్తుతం ఆషాడ మాసం( Ashadamasam ) జరుగుతోంది.జూలై 18 నుంచి శ్రావణమాసం ప్రారంభం కాబోతూ ఉండడం తో అప్పుడు బిజెపి, కాంగ్రెస్ లకు చెందిన కీలక నాయకులందరినీ పార్టీలో చేర్చుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు( BJP MLA Raghunandan Rao ), మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి చంద్రశేఖర్ వంటి వారు బీఆర్ఎస్ లో వేరే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం  బీఆర్ఎస్ లో చేరే ఆలోచనతో ఉన్నారట.

బిజెపిలో ఉన్న  విజయశాంతి సైతం బిజెపిని వీడి బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube