జ్వరాన్ని తగ్గించే ఆయుర్వేద చిట్కాలు.. వీటి ముందు ఇంగ్లీష్ మెడిసిన్ కూడా దిగదుడుపే!

గత కొద్దిరోజుల నుంచి వయసుతో సంబంధం లేకుండా చాలా మంది జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలతో తీవ్రంగా సతమతం అవుతున్నారు.వాతావరణం లో వచ్చిన మార్పులు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

 Ayurvedic Tips To Rid Of Fever , Ayurvedic Tips, Fever, Latest News, Health, Hea-TeluguStop.com

అయితే ఈ సమస్యల‌ను నివారించుకునేందుకు ఇంగ్లీష్ మెడిసిన్ పై ఆధారపడుతుంటారు.కానీ కొన్ని కొన్ని ఆయుర్వేద చిట్కాలతోనూ జ్వరాన్ని తగ్గించుకోవచ్చు.

ఈ ఆయుర్వేద చిట్కాలు ముందు ఇంగ్లీష్ మెడిసిన్ కూడా దిగదుడుపే అనడంలో సందేహం లేదు.మరి ఇంతకీ ఆ ఆయుర్వేద చిట్కాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి.ఆయుర్వేద మూలికలకు రారాజు.తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు నిండి ఉంటాయి.అవి జ్వరాన్ని తగ్గించడానికి సమర్థవంతంగా సహాయపడతాయి.

అందుకోసం ఒక గ్లాస్ వాటర్ లో కనీసం ప‌ది తులసి ఆకులు వేసి బాగా మరిగించి వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో చిటికెడు అల్లం పొడి, వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.

ఇలా చేస్తే జ్వరంతో పాటు జలుబు దగ్గు వంటి సమస్యలు సైతం పరార్ అవుతాయి.

అలాగే జ్వరాన్ని సహజంగా తగ్గించడానికి అశ్వగంధ కూడా ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో హాఫ్ టేబుల్ స్పూన్ అశ్వగంధ పొడి కలుపుకుని రోజుకు ఒకసారి తీసుకోవాలి.అశ్వగంధ లో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేట‌రీ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ సిస్టంను సూపర్ స్ట్రాంగ్ గా మారుస్తాయి.

జ్వరాన్ని తరిమి కొడతాయి.

అలాగే అశ్వగంధ పొడిని పాలలో కలిపి తీసుకోవడం వల్ల జలుబు దెబ్బకు పరారవుతుంది.గొంతు నొప్పిచ‌ గొంతు వాపు వంటి సమస్యలు ఉన్నా సరే దూరం అవుతాయి.కాబట్టి ఇంగ్లీష్‌ మెడిసన్ తో కాకుండా సహజంగానే జ్వరాన్ని తగ్గించుకోవాలని భావించేవారు పైన చెప్పిన ఆయుర్వేద చిట్కాలను పాటించేందుకు ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube