ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎన్నికల్లో పాల్గొనవచ్చు

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్సై సుధాకర్ ( Si Sudhakar ) రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామంలో ఎన్నికల నేపథ్యంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీ కోసం కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్ పాల్గొన్నారు.

 Anyone Can Participate In Elections In A Democratic Country , Democratic Country-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై డి.సుధాకర్ తెలిపారు.ఎన్నికల కమిషన్ ఎన్నికలను ప్రకటించినందున రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని, ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎన్నికల్లో పాల్గొనవచ్చని, ప్రజలు స్వేచ్చగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎన్నికల్లో వివిధ పార్టీల నాయకులు ప్రచారానికి వచ్చినప్పుడు గానీ, ప్రజలు ఓటు హక్కు ఉపయోగించేటప్పుడు గానీ ఎవరైనా ఆటంక పరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఏఎస్ఐ మోతిరామ్, హెడ్ కానిస్టేబుల్ భూమయ్య, కానిస్టేబుళ్లు తిరుపతి, శ్రీనివాస్, జీవన్ లు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube