తల్లిగా మారాక నా మనస్తత్వమే మారింది... ప్రియాంక చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి ప్రియాంక చోప్రా ( Priyanka Chopra ) ఒకరు.బాలీవుడ్ నటిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం హాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయారు.

 Priyanka Chopra Reveals How Mother Hood Has Impacted Her, Priyanka Chopra,-TeluguStop.com

హాలీవుడ్ ఇండస్ట్రీలో స్థిరపడినటువంటి ప్రియాంక చోప్రా పలు సినిమాలు వెబ్ సిరీస్లో చేస్తూ అక్కడే స్థిరపడ్డారు.ఇక ఈమె అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ( Nic Jonaas ) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ దంపతులకు మాల్టీ మేరీ అనే ఒక కుమార్తె కూడా ఉంది.ప్రియాంక చోప్రా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తల్లిగా కూడా తన కూతురి పట్ల అంతే బాధ్యతగా ఉంటారు.

Telugu Bollywood, Hollywood, Mother Hood, Nic Jonaas, Priyanka Chopra-Movie

నిత్యం సోషల్ మీడియాలో( Social media ) ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన కూతురికి సంబంధించిన అన్ని ఫోటోలు వీడియోలను ఈమె అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఈ విధంగా తన కుమార్తెకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకొని ప్రియాంక చోప్రా తాజాగా తాను తల్లి అయిన తర్వాత తనలో వచ్చినటువంటి మార్పుల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.నేను తల్లిగా మారిన తర్వాత నాలో ఎంతో మార్పు వచ్చిందని ఈమె తెలియజేశారు.

Telugu Bollywood, Hollywood, Mother Hood, Nic Jonaas, Priyanka Chopra-Movie

అమ్మగా మారిన తర్వాత నా మనస్తత్వమే మారిపోయిందని ప్రియాంక చోప్రా ( Priyanka Chopra )వెల్లడించారు.చాలా మంది తల్లులు మాదిరిగానే మొదట్లో నాకు ఎన్నో సందేహాలు వచ్చేవి అయితే అమ్మగా మారిన తర్వాత తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, దేనినైనా సాధించగలను అనే నమ్మకం తనలో ఉందని ప్రియాంక చోప్రా తెలిపారు.నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నన్ను ప్రతి ఒక్క విషయంలోనూ ప్రోత్సహిస్తూ ఎంతో ధైర్యాన్ని నాలో నింపారు ఇప్పుడు నేను కూడా నా కూతురికి అదే నేర్పించబోతున్నానని నా కూతురిని పెంచడంలో అది నాకు చాలా సహాయంగా నిలిచిందని ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube