Belly Fat : బాన పొట్టను కరిగించే బెస్ట్ ఆయుర్వేదిక్ డ్రింక్.. రోజు తీసుకున్నారంటే మరిన్ని హెల్త్ బెనిఫిట్స్!

శరీరానికి సరైన శ్రమ లేకపోవడం, గంటలు తరబడి కూర్చుని ఉండడం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి తదితర కారణాల వల్ల ఇటీవల రోజుల్లో కోట్లాది మంది బెల్లీ ఫ్యాట్( Belly fat ) సమస్యతో బాధపడుతున్నారు.పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల శరీర ఆకృతి పూర్తిగా మారిపోతుంది.

 Best Ayurvedic Drink To Lose Belly Fat-TeluguStop.com

అందవిహీనంగా తయారవుతారు.త‌మ‌ను తాము అద్దంలో చూసుకోవడానికి కూడా ఇష్టపడరు.

ఈ క్రమంలోనే బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకునేందుకు తోచిన ప్రయత్నాలు అన్నీ చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే ఆయుర్వేదిక్ డ్రింక్( Ayurvedic drink ) మీకు చాలా బాగా సహాయపడుతుంది.ఈ డ్రింక్ ను రెగ్యులర్ డైట్ లో కనుక చేర్చుకుంటే బెల్లీ ఫ్యాట్ కరగడమే కాకుండా మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందుతారు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయుర్వేదిక్ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అంగుళం ఎండిన అల్లం ముక్క( piece of ginger ), వన్ టేబుల్ స్పూన్ ధనియాలు( Coriander ) వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్ట‌వ్‌ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అయ్యాక అందులో గ్రైండ్ చేసుకున్న ధనియాలు మరియు ఎండిన అల్లాన్ని వేసుకొని 6 నుంచి 8 నిమిషాల పాటు మరిగించాలి.

ఆపై అందులో వన్ టేబుల్ స్పూన్ నల్ల బెల్లం పొడి( Black jaggery powder ) వేసి మరో రెండు నిమిషాల పాటు మరిగించాలి.

Telugu Belly Fat, Ayurvediclose, Fat, Fat Cutter, Tips, Latest-Telugu Health

అనంత‌రం స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుంటే మన ఆయుర్వేదిక్ డ్రింక్ రెడీ అవుతుంది.ఈ డ్రింక్ ను రోజుకు ఒకసారి నిత్యం తీసుకుంటే అనేక ఆరోగ్య లాభాలు పొందుతారు.ప్రధానంగా ఈ డ్రింక్ పొట్టచుట్టూ పేరుకుపోయిన కొవ్వును సమర్థవంతంగా కరిగిస్తుంది.

బాన పొట్టను కొద్ది రోజుల్లోనే నాజూగ్గా మారుస్తుంది.అలాగే ఈ ఆయుర్వేదిక్ డ్రింక్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.

Telugu Belly Fat, Ayurvediclose, Fat, Fat Cutter, Tips, Latest-Telugu Health

బెల్లం లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.ఇది రక్తహీనతను దూరం చేస్తుంది.నీరసం, అలసట వంటి సమస్యలను వదిలిస్తుంది.అలాగే ఈ డ్రింక్ జలుబు, దగ్గు వంటి వాటికి చెక్ పెడుతుంది.ఇమ్యూనిటీ పవర్ ను పెంచి అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.ఇక ప్ర‌స్తుత రోజుల్లో చాలా మంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు.

అలాంటి వారికి ఈ డ్రింక్ ఒక న్యాచురల్ మెడిసిన్‌లా పనిచేస్తుంది.నిత్యం ఈ డ్రింక్ ను తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు పరార్ అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube