జిల్లాలో ఉన్న పాన్ షాప్, కిరాణా షాప్ లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు.జిల్లాలో ఉన్న పాన్ షాప్ లపై 24/7 పోలీస్ నిఘా ఉంటుంది.
జిల్లాలో మత్తు పధార్థాల కి సంబంధించిన సమాచారం మెసేజ్ యువర్ ఎస్పీ 630-392-2572 నెంబర్ తెలియజేయండి.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మత్తు పదార్థాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని, ప్రభుత్వం నిషేధించిన గంజాయి,మరే ఇతర మత్తు పదార్థాల గురించి జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇన్స్పెక్టర్ లు, ఎస్సై లు తమ తమ సిబ్బంది తో కలిసి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఉన్న పాన్ షాపులలో,కిరాణా షాప్ లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని,జిల్లాలో విన్నూత కార్యక్రమాల ద్వారా ప్రజలకి మత్తు పదార్థాల వల్ల కలుగు ఆనార్ధాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు.
ఈ మధ్య కాలంలో గంజాయి చాకిలెట్ల కు సంబంధించిన కేసులు చాలా ప్రదేశాల్లో నమోదు కావడం జరుగుతుందని,మన జిల్లాల్లో కూడా గతంలో సిరిసిల్ల పట్టణ పరిధిలో గాంజా చాకిలెట్లకు సంబంధించిన కేసులు నమోదు కావడం జరిగిందన్నారు.అందువలన జిల్లా పరిధిలో ఉన్న పాన్ షాప్ లలో ఈ రోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందని, జిల్లాలో గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్న, ఇతరులకు విక్రయించిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లోగాని , పట్టణాలలో గాని ఎవరైనా వ్యక్తుల వద్ద, పాన్ షాప్ లలో కిరాణా షాపుల్లో మరే ఇతర షాపుల్లో నైనా ప్రభుత్వం నిషేధించిన గంజాయి, మత్తు పదార్థాలు కలిగి ఉన్నా లేక విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే ప్రజలు వెంటనే మెసేజ్ యువర్ ఎస్పీ 630-392-2572 నెంబర్ కి లేదా డయల్ 100 లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తగిన పారితోషికం అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ లు,ఎస్.
ఐ లు సిబ్బంది పాల్గొన్నారు