అరుణాచల గిరి ప్రదర్శనను టూర్ ప్యాకేజీలాగా టీఎస్ఆర్టీసీ అందిస్తోంది

రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి అరుణాచలం కి ప్రత్యేక బస్సు రాజన్న సిరిసిల్ల జిల్లా: తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు శుభవార్త.నిజ శ్రావణ మాస పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 29న అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణ కు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడపాలని టిఎస్ ఆర్టీసీ వేములవాడ డిపో వేములవాడ, కరీంనగర్ నుండి నడపాలని నిర్ణయించింది.

 Tsrtc Is Offering Arunachal Giri Performance As A Tour Package , Arunachal Giri-TeluguStop.com

సర్వీసు నంబర్ 75555* గల ఈ బస్సు.*ఆగస్టు 29న రాత్రి 8 గంటలకు వేములవాడ బస్టాండ్ నుండి బయలుదేరి కరీంనగర్ కు చేరి అక్కడి నుండి రాత్రి 9 గంటలకు అరుణాచలం బయలుదేరును.

ఆంధ్రప్రదేశ్ కాణిపాకంలోని విఘ్నేశ్వరుని దర్శనం, వెల్లూరులోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అనంతరం ఆగస్టు 30వ తేదీ రాత్రి 8 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది.అరుణాచలేశ్వర స్వామి వారి గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత ఆగస్టు 31వ తేదీ సాయంత్రం 5 గంటలకు బయలుదేరి సెప్టెంబర్ ఒకటవ తేదీ ఉదయం శ్రీ అలంపూర్ జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం సన్నదికి వెళ్తుంది.

అక్కడ దర్శనానంతరం కరీంనగర్ కు అదే రోజు సాయంత్రం 6 గంటలకు చేరుకుంటుంది.అరుణాచల గిరి ప్రదర్శనను టూర్ ప్యాకేజీలాగా టీఎస్ఆర్టీసీ అందిస్తోంది.ఈ ప్యాకేజీ ధరను ఒక్కొక్కరికి రూ.4500 గా సంస్థ నిర్ణయించింది.అన్ని సెస్ చార్జీలు, బోర్డర్ టాక్స్లు,టోలు టాక్సులు కలుపుకొని నాలుగు దేవస్థానము లు కలుపుకొని టూర్ ప్యాకేజీ గా అందిస్తుంది.పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదక్షిణ కు భక్తుల రద్దీ దృష్ట్యా వేములవాడ, కరీంనగర్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది.

ఈ సదుపాయాన్ని అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులు వినియోగించుకోవాలి.ఈ టూర్ ప్యాకేజీని సంస్థ అధికారిక వెబ్ సైట్ టి ఎస్ ఆర్టీసీ .ఇన్ లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు.వేములవాడ కరీంనగర్ సిరిసిల్ల మరియు చుట్టుపక్కల ప్రాంతాల వారు తమ దగ్గరలోని బస్టాండ్ తో పాటు సమీప టీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలోనూ బుక్ చేసుకోవచ్చు.

ఈ టూర్ ప్యాకేజీకి సంబందించిన పూర్తి సమాచారం కోసం 9959225926, 7382851826 ఫోన్ నంబర్లను సంప్రదించగలరు.’ అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్, కరీంనగర్ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శవినోద్ కుమార్ సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube