ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మాజీ ఎంపీటీసీ

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర, రాగట్లపల్లి, ఎల్లారెడ్డిపేట ,గొల్లపల్లి ,రాజన్న పేట,కిష్టు నాయక్ తండా,అల్మస్ పూర్ గ్రామానికి చెందిన సుమారు 50 నుండి 60 మంది విద్యార్థుల కష్టాలు ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu Balaraju Yadav ) ప్రత్యేక చొరవతో ఆర్థికబారం నుండి గట్టెక్కించినారు.గతంలో పదిర గ్రామం లో నుండి వీర్నపల్లి మోడల్ స్కూల్ కు విద్యార్థులు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డిపేట( Yellareddipeta ) మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ సిరిసిల్ల డిపో మేనేజర్ మనోహర్ తో మాట్లాడగా పదిర గ్రామం నుండి వీర్నపల్లి కి విద్యార్థులకు బస్ ఏర్పాటు చేయించడం జరిగింది.

 Former Mptc Who Kept His Promise Rajanna Sirisilla , Oggu Balaraju Yadav , Yell-TeluguStop.com

రాచర్ల గొల్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పదిర,రాగట్లపల్లి, గొల్లపల్లి రాజన్న పేట, కిష్టునాయక్ తండా, అల్మాస్ పూర్ గ్రామాల మీదుగా వీర్నపల్లి మోడల్ స్కూల్ వరకు శనివారం ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ వినతి మేరకు మోడల్ స్కూల్ వరకు బస్ ను ప్రారంబించారు .మోడల్ స్కూల్ కు విద్యార్థులు వెళ్తున్న క్రమంలో విద్యార్థులు ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ తో ఫోటో దిగి హర్షం వ్యక్తం చేసి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.డిపో మేనేజర్ మనోహర్ కు ,ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ కు విద్యార్థుల తల్లిదండ్రులు దన్యావాదాలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube