పోలీసుల పెరు చెప్పి డబ్బులు వసూలు చేసిన ఘటనలో కేసు నమోదు

రాజన్న సిరిసిల్ల జిల్లా :పోలీసుల పెరు చెప్పి డబ్బులు వసూలు చేసిన ఘటనలో కేసు నమోదు.

ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్ర చారి( DSP Nagendra Chari ) మాట్లాడుతూ.

తేదీ 12.01.

2024 రోజున తంగల్లపల్లి పోలీస్ వారు ట్రాక్టర్ వే బిల్లు చూపించనందున మూడు ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కి తరలించగా , అదే అదునుగా చేసుకొని తంగళ్ళపల్లి కి చెందిన అక్కపల్లి ఎల్లారెడ్డి( Akkapalli Ellareddy ) అనే వ్యక్తి మూడు ట్రాక్టర్లలో ఒక ట్రాక్టర్ ఓనర్ అయిన సురా వెంకటరమణకు కాల్ చేసి తంగాలపల్లి పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతూన్న నేను ఎస్.

ఐ తో మాట్లాడి మీ యెక్క ట్రాక్టర్ తీసుకవస్తా అని చెప్పి బెదిరించి బలవంతంగా 13,000=00 రూపాయలు తీసుకుని, తమ సొంతా ఖర్చులకు వాడుకున్నారు.

మంగళవారం రోజున వెంకటరమణ ఇచ్చిన పిర్యాదు మేరకు ఎల్లారెడ్డిపై కేసు నమోదు చేసి అక్కపల్లి ఎల్లారెడ్డిని మంగళవారం రోజున సాయంత్రం అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని,మరికొంత మందిపై విచారణ జరుగుతుందని డిఎస్పీ గారు తెలిపారు.

ప్రజలకు విజ్ఞప్తి.పోలీస్ ల పేరుతో కానీ,పోలీస్ వారికి మేము సన్నిహితులం అంటూ బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడే వారి పాట్ల అప్రమత్తంగా ఉంటూ అలాంటి సంఘటనలు మీ దృష్టికి వస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని డిఎస్పీ నాగేంద్రచారి కోరారు.

హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే తమలపాకులు.. ఎలా వాడాలంటే?