ఉమ్మడి ఏపీలో సినిమాల థియేటర్లకు అడ్డాగా ఉండేది హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్.క్రాస్ రోడ్డులో సినిమా చూడు.
బావర్చిలో బిర్యానీ తిను అనే సామెతే పుట్టిందంటే ఇక్కడున్న సినిమా థియేటర్ల గొప్పతనమేంటో చెప్పుకోవచ్చు.అందుకే తమ తమ సినిమాలు విడుదలైన రోజు హీరోలు, దర్శకులు ఇక్కడి థియేటర్లలో ప్రేక్షకుల మధ్యలో కూర్చుని చూస్తారు.
అలాంటి ఈ అడ్డాలో తక్కువ సమయంలో కోటి రూపాయలు వసూలు చేసిన సినిమాలు చాలా ఉన్నాయి.ఇంతకీ ఆ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.సాహో, బాహుబలి2
విపరీతమైన హైప్ క్రియేట్ చేసుకుని వచ్చిన ఈ రెండు సినిమాలు కేవలం 4 రోజుల్లోనే కోటి రూపాయలు వసూలు చేశాయి.గతంలో ఎప్పుడూ లేని సరికొత్త రికార్డు సృష్టించాయి.
సరిలేరు నీకెవ్వరు
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా 7 రోజుల్లో కోటిరూపాలు కలెక్ట్ చేసింది.
అల వైకుంఠపురంలో
అల్లు అర్జున్, సమంత హీరో, హీరోయిన్లుగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అల వైకుంఠపురంలో.ఈ సినిమా 8 రోజుల్లో కోటి రూపాయలు వసూలు చేసింది.
బాహుబలి, రంగస్థలం
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం, రాజమౌళి భారీ ప్రాజెక్టు బాహుబలి1 క్రాస్ రోడ్డులో 9 రోజుల్లో కోటి రూపాయలు వసూలు చేశాయి .
మహర్షి
మహేష్ బాబు హీరోగా చేసిన మహర్షి సినిమా 10 రోజుల్లో కోటి రూపాయలు సాధించింది.
శ్రీమంతుడు, సైరా, రోబో 2.0
ఈ మూడు సినిమాలు 11 రోజుల్లో కోటి రూపాయలు కలెక్ట్ చేశాయి.
అరవింద సమేత
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన అరవింద సమేత సినిమా 12 రోజుల్లో కోటిరూపాయలు వసూలు చేసింది.
భరత్ అనే నేను
మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను.13 రోజుల్లో కోటి రూపాయలు కొల్లగొట్టింది.
అత్తారింటికి దారేది
త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా 17 రోజుల్లో కోటి రూపాయలు వసూలు చేసింది.
ఎఫ్2
వెంటేష్, వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా 23 రోజుల్లో కోటిరూపాలయ కలెక్షన్ సాధించింది.