మండలంలోని 24 గ్రామపంచాయతీలకు జాతీయ పంచాయతీ అవార్డులు 2023

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు 2023 జాతీయ పంచాయతీ అవార్డులను ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , ఎంపీడీవో చిరంజీవి, తహసిల్దార్ జయంత్ కుమార్ లు కలిసి ఆయా గ్రామ పంచాయతీ సర్పంచులకు, ఎంపీటీసీ సభ్యులకు పంచాయతీ కార్యదర్శులకు మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం అందజేశారు, ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ 2023 జాతీయ గ్రామపంచాయతీ అవార్డులను తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేయడం గొప్ప విషయమని అన్నారు.

 National Panchayat Awards 2023 For 24 Gram Panchayats Of Ellareddypeta Mandal De-TeluguStop.com
Telugu Latest, Rajannasircilla, Sudheer, Telugudistricts-Rajanna Sircilla

ప్రత్యేకంగా జాతీయ గ్రామపంచాయతీ అవార్డులను గౌరవప్రదంగా ఉండేందుకు గ్రామ సర్పంచులకు ఎంపీటీసీ సభ్యులకు పంచాయతీ కార్యదర్శులకు అందజేసినందుకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.వివిధ గ్రామాల సర్పంచులకు,పంచాయతీ కార్యదర్శి కి ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ , జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య లు కలిసి ప్రశంస పత్రము అందజేసి శాలువాలతో వారిని సన్మానించారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి , సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు కొండాపురం బాల్ రెడ్డి, ఎం పి ఓ వజీర్ హైమద్, వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీ సభ్యులు,పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube