దాదాపు 400 పైగా రోగులకు ఉచిత పరీక్షలు.మందులు పంపిణీ చేసిన హెల్ప్ లైన్ ఆస్పత్రి యాజమాన్యం.
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఐఎంఏ కరీంనగర్, శ్రీ సాయి లైఫ్ లైన్ హాస్పిటల్, కరీంనగర్ వారి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక లోని బిసిఏం కంటి దవఖానాలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వివిధ వ్యాధులకు సంబంధించిన వైద్యులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
ఉచిత వైద్య శిబిరంలో దాదాపు 400 పైగా రోగులు వచ్చి వివిధ పరీక్షలు నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జగన్మోహన్ రావు, ఐఎంఏ కరీంనగర్ అధ్యక్షులు రామ్ కిరణ్ హాజరయ్యారు.
అనంతరం లైఫ్ లైన్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ తన సొంత గ్రామం కొదురుపాక కాబట్టి ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
డాక్టర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ ప్రదీప్ కుమార్ ను అభినందిస్తున్నట్లు తెలిపారు.
వైద్య శిబిరంలో లైఫ్ లైన్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ కాంచన్, గైనకాలజిస్ట్ డాక్టర్ నయని, ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ శ్రీకాంత్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.