సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో మంచి నటుల కోసం చాలా మంచి క్యారెక్టర్లు రాస్తుంటారు.అయితే కొందరు మాత్రం ప్రత్యేకంగా తమ కోసమే క్యారెక్టర్లు రాసుకొని ఆ పాత్రలో రెచ్చిపోవాలని అనుకుంటారు.
అలా అనుకున్న వారిలో ఇద్దరు మాత్రం ఆ పాత్రలను వేరే వాళ్ళకి ఇచ్చేశారు.ఆ ఇద్దరు సినీ సెలబ్రిటీలు ఎవరు, ఎందుకు తమ కోసం రాసుకున్న రోల్స్ ఇతర నటులకు ఇచ్చేశారు అనేది తెలుసుకుందాం.
• ధనుష్ – సందీప్ కిషన్ – రాయన్
ధనుష్ డైరెక్ట్ చేసిన యాక్షన్ క్రైమ్ మూవీ రాయన్( Rayan ) (2024) సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే.ఇది రూ.75 కోట్లు పెట్టి తీస్తే బాక్సాఫీస్ వద్ద రూ.123 కోట్ల దాకా కలెక్షన్స్ వసూలు చేసింది.ఇందులో ధనుష్ కథవరాయన్ “రాయన్”గా కనిపించి మెప్పించాడు.నిజానికి ఆయన ఈ పాత్ర చేయాల్సింది కాదు.ఈ పాత్రకు తమ్ముడు అయిన ముత్తువేల్రాయన్ “ముత్తు”గా ధనుష్ యాక్ట్ చేయాలనుకున్నాడు.ఆ పాత్రను చాలా చక్కగా తన కోసమే రాసుకున్నాడు.
కానీ తర్వాత ఆ రోల్ సందీప్ కిషన్ మాత్రమే చేయగలడని నమ్మి అతనికి ముత్తు పాత్రను ఇచ్చాడు.సందీప్ కిషన్ చాలా బాగా నటించి ధనుష్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
• అనిల్ రావిపూడి – సప్తగిరి – కందిరీగ
సంతోష్ శ్రీనివాస్ ( Santosh Srinivas )డైరెక్ట్ చేసిన రొమాంటిక్ కామెడీ యాక్షన్ మూవీ కందిరీగ (2011) బ్లాక్ బస్టర్ హిట్ అయింది.దీనికి అనిల్ రావిపూడి స్టోరీ అందించాడు.అంతేకాదు ఈ సినిమాలో తనకోసం ఒక స్పెషల్ రోల్ రాసుకున్నాడు.చివరికి ఆ పాత్రలో నటించకూడదని నిర్ణయించుకున్నాడు.ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన యాక్టర్ కు ఈ క్యారెక్టర్ ఇస్తే వారి కెరీర్ నిలబెట్టినట్టు అవుతుందని భావించాడు.అందుకే తన ఫ్రెండ్ అయిన సప్తగిరికి( Saptagiri ) ఆ పాత్రను ఆఫర్ చేశాడు.
ఈ క్యారెక్టర్ పేరు గిరి.ఇందులో సప్తగిరి చాలా బాగా నటించి ఆకట్టుకున్నాడు.
హన్సిక, రామ్ పోతినేని హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది.ఇది మంచి హిట్ కావడం వల్ల సప్తగిరి కి కూడా చాలా గుర్తింపు లభించింది.
ఇంకా ఇలా తమ కోసమే క్యారెక్టర్లు రాసుకొని వాటిని వేరే వారికి ఇచ్చిన సినీ సెలబ్రిటీలు కూడా ఉండి ఉండొచ్చు.వాటి వల్ల చాలామంది నటులు తమ కెరీర్ గ్రాఫ్ పెంచుకొని ఉండవచ్చు.