ఇక్కడ దాదాపుగా అవసరం కోసం కారుని కొనేవారికంటే, కార్లంటే ఇష్టంతోనే ఎక్కువమంది కొంటూ వుంటారు.అలాంటివారు కలలు కని మరీ కొనుక్కున్న కారు ఒక్కసారి పాతబడితే ఇక వారి బాధ అంతాఇంతా కాదు.
అయితే మీకు కూడా అలాంటి పరిస్థి వచ్చినా లేదంటే మీరు సెకండ్ హ్యాండ్ కారు కొన్నా, మీరు ఇలా అలా బాధపడాల్సిన అవసరమే లేదు.ఇక్కడ పేర్కొన్న 5 యాక్సెసరీలను( Accessories ) వాడి మీ కారుకు కొత్త హంగును అద్దండి.
ఇక మీకారు ఎప్పటికీ పాతదిలాగా అనిపించదు, మీకైనా చూసేవారికైనా.

ఈ లిస్టులో ముందుగా చెప్పుకోదగ్గది “స్మార్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్”( Smart Infotainment System ) ఇది మీ కారు కొత్తగా కనిపించేలా చేస్తుంది.ఈ స్మార్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ ని కలిగి ఉంటాయి.వీటి ద్వారా గూగుల్ మప్స్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, డయల్ ప్యాడ్, 4G ఇంటర్నెట్ సహా మరియు ఎన్నో ఫీచర్లను ఎంజాయ్ చేయొచ్చు.
తరువాత చెప్పుకోదగ్గది “రివర్స్ పార్కింగ్ కెమెరా”( Reverse Parking Camera ).మీ పాత కారులో రివర్సింగ్ కెమెరాను అమర్చుకోవడం అనేది చాలా ముఖ్యం.దీనివల్ల మీ కారు వెనుక వైపు జరిగే వాహనాలు కదలికలను స్పష్టముగా చూడగలుగుతారు.

ఈ లిస్టులో మూడవది “హెడ్ అప్ డిస్‌ప్లే.”( Heads up display ) ఇది డ్రైవర్ కారు ముందు భాగంలో చూసే ఫీల్డ్‌లోని ముఖ్యమైన సమాచారాన్ని చూపిస్తుంది.మీ పాత కారుకు హెడ్-అప్ డిస్‌ప్లే యాక్సెసరీని జోడించడం వలన అది చాలా మోడర్న్ గా కనిపిస్తుంది.
అదేవిధంగా “టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్” వ్యవస్థ మీ కారులోని ప్రతి టైర్ లో గాలి ఒత్తిడి ఎంత ఉందనేది మీకు డిస్ ప్లే చేస్తుంది.ఆ సమాచారం ఆధారంగా కారు టైర్లలో గాలిని మెయింటైన్ చేసే వీలు ఉంటుంది.
లాంగ్ జర్నీ చేసినపుడు ఇది చాలా హెల్ప్ ఫుల్.చివరగా “వైర్‌లెస్ ఛార్జర్” ( Wireless Charger )గురించి చెప్పుకోవాలి.
వైర్‌లెస్ ఛార్జింగ్ సాంకేతికతతో మీ మొబైల్ ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వైర్‌లెస్‌గా కారులో ఛార్జ్ చేసుకోవచ్చు.ఈ ఫీచర్ సహాయకరంగా ఉండటమే కాకుండా డ్యాష్‌బోర్డ్‌లో తక్కువ వైర్‌లు అంటుకోవడంతో క్యాబిన్‌ను డీక్లటర్ చేస్తుంది.







