తడిసిన ధాన్యం మిల్లర్లు కొనుగోలు చేయాలి:అదనపు కలెక్టర్

నల్లగొండ జిల్లా:గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ముందుకు రావాలనినల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ జె.

శ్రీనివాస్ ( J Srinivas )అన్నారు.నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం( Vemulapally ) సల్కునూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు( Grain-purchases ) కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి కేటాయించిన మిల్లులకు ఎగుమతి చేయాలని అధికారులను ఆదేశించారు.

మిల్లర్లు ఎటువంటి కొర్రీలు పెట్టకుండా ఎగుమతి చేసిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిసిఓ వెంకటేశ్వరరావు,డిఎం నాగేశ్వరరావు,మండల తహశీల్దార్ షేక్ జమీరోద్దిన్,సివిల్ సప్లై డిటి జావిద్,ఎఆర్ఐ రేణుక,సహకార సంఘం కార్యదర్శి నరేష్,సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

తొమ్మిది బంగారు పతకాలతో ఎంబీబీఎస్.. ఇతని సక్సెస్ స్టోరీ తెలిస్తే వావ్ అనాల్సిందే!