వీడియో వైరల్: లారీ బీభ‌త్సం.. బైకును ఈడ్చుకుంటూ..?!

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు( Road Accidents ) జరుగుతూనే ఉంటాయి.అప్పుడప్పుడు ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటాయి.

 Rider Hangs From Truck His Bike Dragged On Road After Crash,lorry Accident, Vira-TeluguStop.com

ఇలాంటి ప్రమాదాలలో కొందరు అమాయకులు బాలి అవ్వడం చూస్తూనే ఉంటాం.కొందరు ఎంత జాగ్రత్తగా రోడ్డుపై ప్రయాణాలు చేస్తున్న.

ఎదుటివారి వల్ల అమాయకులు బలి కావాల్సి వస్తుంది.తాజాగా హైదరాబాద్ నగరం( Hyderabad )లో ఓ లారీ బీభస్థాన్ని సృష్టించింది.

ఈ లారీ సృష్టించిన భయానక దృశ్యాలుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ యాక్సిడెంట్ సంబంధించి వివరాలు చూస్తే.


హైదరాబాద్ మహానగరంలోని కర్మన్ ఘాట్( Karmanghat ) వద్ద ఓ లారీ రెచ్చిపోయి ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తీసుకువచ్చింది.మొదటగా ఓ కార్ ను ఢీకొట్టిన లారీ డ్రైవర్( Car Lorry Accident ) అక్కడ జరిగిన సంఘటనతో చుట్టుపక్కల వారు ఏమంటారో అన్న భయంతో లారీని ఆపకుండా వెళుతున్న సమయంలో.మరో ద్విచక్ర వాహనంపైకి లారీని దూసుకెళ్లించాడు.దాంతో అతను వాహనాన్ని ఆపకుండా మరింత వేగం పెంచి దాదాపు రెండు కిలోమీటర్ల వరకు లారీని ముందుకి తీసుకెళ్లాడు.ఈ సంఘటనలో బైక్ నడిపే వ్యక్తి హఫీజ్ తన ప్రాణాలు కాపాడుకునేందుకు లారీ క్యాబినెట్ ను పట్టుకొని ప్రాణాలను తన చేతిలో పెట్టుకొని బతికిపోయాడు.

అయితే లారీ డ్రైవర్ ను కొంత దూరం కొందరు బైకర్లు వెంబడించడంతో లారీ ఎల్బీనగర్ వైపు వెళ్లి.చివరకు వనస్థలిపురం వద్ద వాహనాన్ని ఆపేశాడు.ఆ తర్వాత లారీ డ్రైవర్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్( Vanasthalipuram Police Station ) లో లొంగిపోయాడు.

ఇక ఈ ఘటనకు సంబంధించి బాధితుడు నుండి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజెన్స్ ఒకింత భయభ్రాంతులకు లోనవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube