టాలీవుడ్ లో చాలామంది దర్శకులకు ఇన్స్పిరేషన్ గా ఉంటాయి త్రివిక్రమ్ ( Trivikram Srinivas )సినిమాలు.మాటల మాంత్రికుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంటుంది.
అయితే ఇటీవల ఆయన సినిమాలు ఒకటి విజయం సాధిస్తే మరొకటి పరాజయం అన్నట్టుగా ఉంది ఆయన సినిమాల పరిస్థితి.ఇక మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చివరగా విడుదలై నాలుగు నెలలు అవుతుంది.
అయినా కూడా అతని తదుపరి సినిమా అప్డేట్ ఏంటో ఇప్పటి వరకు తెలియడం లేదు.ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
మొక్కుబడిగా అల్లు అర్జున్( Allu Arjun ) తో ఒక సినిమా అనౌన్స్ చేసినప్పటికీ అది ఇప్పట్లో పట్టాలు ఎక్కే పరిస్థితి లేదు.

అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.ఆ సినిమా విడుదలవడానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది.సినిమా విడుదలయ్యాక కాస్త గ్యాప్ తీసుకుని అట్లీ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆ సినిమా అయ్యాక మరొక సినిమా కూడా త్రివిక్రమ్ కన్నా ముందు లైన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి ఎన్ని సినిమాలు పూర్తి చేసి ఎప్పుడు త్రివిక్రమ్ చిత్రానికి అల్లు అర్జున్ వస్తాడు అనేది పెద్ద ప్రశ్న.
అయితే త్రివిక్రమ్ దేనికోసం ఒక ప్రణాళికను రచిస్తున్నాడట.గతంలో కూడా అత్తారింటికి దారేది, s/o సత్యమూర్తి సినిమాల విజయం సాధించిన తర్వాత మామూలు హీరో అయినా నితిన్ తో అ ఆ అనే సినిమా తీశాడు.

ఆ సినిమా సైతం మంచి విజయాన్ని అందుకుంది.ఇప్పుడు కూడా కొత్త సినిమా తీయడానికి ముందు మరియు ఆ తర్వాత ఒక చిన్న సినిమా తీయాలి అనుకుంటున్నాడట.నువ్వే నువ్వే నువ్వు నాకు నచ్చావ్ అంటే సినిమాలు తెలుగు తీసిన స్రవంతి మూవీస్ రామ్ పోతినేనీ( Ram Pothineni ) తో త్రివిక్రమ్ చిత్రాన్ని తీయాలని అనుకుంటున్నాడట.చాలా రోజులుగా రామ్ కి మంచి సినిమా పడటం లేదు ప్రస్తుతం డబల్ ఇస్మార్ట్ సినిమా పనిలో ఉన్నాడు.
అలాగే త్రివిక్రమ్ కూడా సినిమా లవ్ స్టోరీ తీయడంలో దిట్ట.వీరిద్దరి కాంబినేషన్లో ఒక మంచి సినిమా రావాలని అందరూ కోరుకుంటున్నారు.