యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామానికి చెందిన చాపల వెంకటేశ్వర్లు సాదుకుంటున్న పశువులు అకాల వర్షాలకు పిడుగు పాటుతో మృతి చెందిన విషయం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లమల కృష్ణారెడ్డి సోమవారం స్పందించారు.
రైతు వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్ళి పరామర్శించి,రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.అలాగే పశువులను కూడా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,గుజ్జ గ్రామస్తులు పాల్గొన్నారు.