బీర్ ను ఎలా పడితే అలా తాగేస్తున్నారా.. అయితే ఇలా ట్రై చేయండి.. ఆరోగ్యంగా ఉండండి..

ప్రపంచంలో చాలామంది బీరు( Beer ) తాగడానికి ఎంతో ఇష్టపడతారు.మద్యం సేవించడంలో ముందుగా చాలామంది ఎంచుకునేది కేవలం బీరు మాత్రమే.

 Are Drinking Beer The Way You Like It But Try Thistay Healthy, Viral Video, Soci-TeluguStop.com

అయితే చాలామంది ఈ బీర్ తాగే విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.ఒకసారి ఈ బీర్ కొద్దిగా తాగినా కూడా కడుపు ఉబ్బడం, లేకపోతే గ్యాస్ రావడం లాంటి ఇబ్బందులను ఎదుర్కోవడం తరచుగా చూస్తూనే ఉంటాయి.

అయితే ఇలాంటి పొరపాట్లు జరగడానికి గల కారణాలను తాజాగా ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా వీడియో రూపంలో విషయాన్ని తెలియజేశారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో తెగ వైరల్ గా మారింది.

ఇక వైరల్ గా మారిన వీడియోలో ఏముందన్న విషయం చూస్తే.

వైరల్ గా మారిన వీడియోలో ఓ వ్యక్తి మొదటగా రెండు గాజు సీసాలను అలాగే రెండు బీర్ టిన్లను తీసుకొని ఉంటాడు.ఆ తర్వాత ఆ వ్యక్తి మొదటి బీర్ టిన్ ఓపెన్ చేసి గాజు గ్లాసులో చాలా నిదానంగా ఒకవైపుకు వంచి పోస్తాడు.అలా చేయడం ద్వారా ఎలాంటి నురగ గ్లాసులో ఏర్పడదు.

ఇక ఆ తర్వాత మరొక గాజు గ్లాసును తీసుకొని మరో బీర్ టిన్ ను ఒక్క సారిగా పోసేస్తాడు.ఆ సమయంలో గాజు గ్లాసులో చాలా ఎక్కువగా నురుగా ఏర్పడుతుంది.

ఆ తర్వాత అతడు రెండు గ్లాసులను ముందుగా ఉంచి ఇలా వేరువేరుగా పోయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి., వాటిని ఎలా అధిగమించవచ్చు., ఎలాంటి బీరును తాగవచ్చు లాంటి విషయాలను తెలిపాడు.

ఇందుకోసం అతడు రెండు టిష్యూ పేపర్లను తీసుకొని మొదటగా నిదానంగా పోసిన గాజు గ్లాసులో టిష్యుని ముంచి గట్టిగా తిప్పాడు.ఆ సమయంలో గాజు గ్లాసులో నురగ చాలా ఎక్కువగా బయటకు వస్తుంది.ఇలాంటి బీరును తాగడం వల్ల మనిషికి కడుపు ఉబ్బరం రావడం, కడుపు ఫుల్లుగా అయిపోయినట్లు అనిపించడం లాంటివి జరుగుతాయని వివరించాడు.

ఇక ఆ తర్వాత మరో గ్లాసులో టిష్యూ పేపర్( Tissue Paper ) ను గట్టిగా తిప్పగా గ్లాసులో టిష్యూ పేపర్ పెట్టక ముందు ఎలా ఉందో ఆ తర్వాత కూడా అలాగే ఉంది.కాబట్టి రెండో గ్లాసులో పోసిన బీరును తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవని ఈ వీడియో ద్వారా అతను తెలిపాడు.

ప్రస్తుతం ఈ తేడాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube