బీర్ ను ఎలా పడితే అలా తాగేస్తున్నారా.. అయితే ఇలా ట్రై చేయండి.. ఆరోగ్యంగా ఉండండి..

ప్రపంచంలో చాలామంది బీరు( Beer ) తాగడానికి ఎంతో ఇష్టపడతారు.మద్యం సేవించడంలో ముందుగా చాలామంది ఎంచుకునేది కేవలం బీరు మాత్రమే.

అయితే చాలామంది ఈ బీర్ తాగే విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.ఒకసారి ఈ బీర్ కొద్దిగా తాగినా కూడా కడుపు ఉబ్బడం, లేకపోతే గ్యాస్ రావడం లాంటి ఇబ్బందులను ఎదుర్కోవడం తరచుగా చూస్తూనే ఉంటాయి.

అయితే ఇలాంటి పొరపాట్లు జరగడానికి గల కారణాలను తాజాగా ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా వీడియో రూపంలో విషయాన్ని తెలియజేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా( Social Media )లో తెగ వైరల్ గా మారింది.

ఇక వైరల్ గా మారిన వీడియోలో ఏముందన్న విషయం చూస్తే. """/" / వైరల్ గా మారిన వీడియోలో ఓ వ్యక్తి మొదటగా రెండు గాజు సీసాలను అలాగే రెండు బీర్ టిన్లను తీసుకొని ఉంటాడు.

ఆ తర్వాత ఆ వ్యక్తి మొదటి బీర్ టిన్ ఓపెన్ చేసి గాజు గ్లాసులో చాలా నిదానంగా ఒకవైపుకు వంచి పోస్తాడు.

అలా చేయడం ద్వారా ఎలాంటి నురగ గ్లాసులో ఏర్పడదు.ఇక ఆ తర్వాత మరొక గాజు గ్లాసును తీసుకొని మరో బీర్ టిన్ ను ఒక్క సారిగా పోసేస్తాడు.

ఆ సమయంలో గాజు గ్లాసులో చాలా ఎక్కువగా నురుగా ఏర్పడుతుంది.ఆ తర్వాత అతడు రెండు గ్లాసులను ముందుగా ఉంచి ఇలా వేరువేరుగా పోయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి.

, వాటిని ఎలా అధిగమించవచ్చు., ఎలాంటి బీరును తాగవచ్చు లాంటి విషయాలను తెలిపాడు.

"""/" / ఇందుకోసం అతడు రెండు టిష్యూ పేపర్లను తీసుకొని మొదటగా నిదానంగా పోసిన గాజు గ్లాసులో టిష్యుని ముంచి గట్టిగా తిప్పాడు.

ఆ సమయంలో గాజు గ్లాసులో నురగ చాలా ఎక్కువగా బయటకు వస్తుంది.ఇలాంటి బీరును తాగడం వల్ల మనిషికి కడుపు ఉబ్బరం రావడం, కడుపు ఫుల్లుగా అయిపోయినట్లు అనిపించడం లాంటివి జరుగుతాయని వివరించాడు.

ఇక ఆ తర్వాత మరో గ్లాసులో టిష్యూ పేపర్( Tissue Paper ) ను గట్టిగా తిప్పగా గ్లాసులో టిష్యూ పేపర్ పెట్టక ముందు ఎలా ఉందో ఆ తర్వాత కూడా అలాగే ఉంది.

కాబట్టి రెండో గ్లాసులో పోసిన బీరును తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవని ఈ వీడియో ద్వారా అతను తెలిపాడు.

ప్రస్తుతం ఈ తేడాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

తప్పు పైన తప్పు చేస్తున్న హీరో రాజ్ తరుణ్..ఇలా చేస్తే ఇంకా పాతాళానికే!