సినిమా ఇండస్ట్రీ అన్నాక ఏదో ఒకటి అవుదామ ని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటే హీరో అవ్వాలని వచ్చేవారు మరి కొంతమంది.అదృష్టం కలిసి వస్తే అందులో కొంతమంది అయినా హీరోలు అవుతారు.
మరికొంత మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిపోతారు.ఏదైనా కూడా ఆ నటనతో అలాగే పర్ఫామెన్స్ తో ఎంత సంబంధం ఉంటుందో అదృష్టం కూడా దానికి తోడవడం చాలా ముఖ్యం.
అలా కొంతమంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మనం చూస్తున్న వారంతా కూడా ఒకప్పుడు స్టార్ హీరోలుగా చలామణి అయినవారే.ప్రస్తుతం టాలీవుడ్ లో కమెడియన్స్ గా ఉన్న కొంతమంది ఒకప్పుడు మెయిన్ లీడ్స్ పాత్రను పోషించారు వారు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రాజేంద్రప్రసాద్( Rajendra Prasad ) లాంటి సీనియర్ యాక్టర్ ప్రస్తుతం కామెడీ బాగా నవ్విస్తాడు అలాగే ఎమోషన్ ని కూడా అంతే చక్కగా చేయగలడు.ఫాదర్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తున్నాడు ప్రస్తుతం కానీ మొన్నటి వరకు కామెడీ హీరోగా పని చేశాడు.అంతకన్నా ముందు స్టార్ హీరోగా టాలీవుడ్ లో ఎన్నో ఏళ్లపాటు ఏకచత్రాధిపత్యం చేశాడు.కేవలం రాజేంద్రప్రసాద్ మాత్రమే కాదు ఇప్పుడు అంతేగా అంతేగా అంటూ అనిల్ రావిపూడి సినిమాలు అయినా ఎఫ్2, ఎఫ్3 లో కనిపించిన ప్రదీప్ సైతం ఒకప్పుడు మంచి హీరో.
దర్శకుడు జంధ్యాలకు దగ్గర బంధువు అయిన ప్రతి రెండు జెళ్ళ సీత లాంటి సినిమాలో హీరోగా నటించాడు.ఆ తర్వాత అనేక సినిమాలకు మంచి హీరోగా పని చేశాడు.
ఆయన హీరోగా ఉన్న సమయంలో ప్రతిరోజు ఇంటికి 500కు పైగా లవ్ లెటర్స్ వచ్చేవట.
ఇక ప్రస్తుతం లేడీ కమెడియన్ గా సీనియర్ ఆర్టిస్ట్ గా ఉన్న కోవై సరళ ( Kovai Sarala )సైతం ఒకప్పుడు హీరోయిన్ గా పని చేసింది.పైగా ఆమె అప్పట్లో ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్.ఎంత డిమాండ్ ఉంది అంటే ఆమె డేట్స్ కోసం కమల్ హాసన్ ఏకంగా ఐదు నెలల పాటు వెయిట్ చేశాడట.
అలా వారి కాంబినేషన్ లో ఓ సినిమా కూడా వచ్చింది.ఇక కమెడియన్ సుధాకర్( Comedian Sudhakar ) సైతం ఆశామాషి హీరో ఏమీ కాదు.
టాలీవుడ్ లో హీరోగా పెద్దగా చేయలేదు కానీ తమిళనాడులో ఆయన స్టార్ హీరోగా చాలా ఏళ్లపాటు పని చేశారు.కానీ అక్కడి రాజకీయాలను భరించలేక తమిళ సినిమా ఇండస్ట్రీని వదిలేసి వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమిడియన్ గా చాలా ఏళ్లపాటు నవ్వించారు.