కర్పూరం అనేది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ ఉండే ఒక ఘాటైన వాసన గల పదార్థము.కర్పూరాన్ని ఎక్కువగా హారతి ఇవ్వటానికి ఉపయోగిస్తాం.
ఏమైనా పూజలు జరిగినప్పుడు పూజ పూర్తి అయ్యాక కర్పూరంతో హారతి ఇవ్వటం సహజమే.అయితే కర్పూరంలో ఎన్నో సౌందర్య రహస్యాలు దాగి ఉన్నాయి.వీటి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.కొద్దిగా కర్పూరాన్ని నూనెలో వేసి గోరువెచ్చగా చేసి దురద ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేసి రాత్రంతా ఆలా వదిలేసి మరుసటి ఉదయం శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా రోజు చేస్తూ ఉంటే దురద క్రమంగా తగ్గిపోతుంది.
కొన్ని తులసి ఆకులను మెత్తని పేస్ట్ గా చేసి దానిలో కొన్ని చుక్కల కర్పూరం నూనెను వేసి బాగా కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా రోజు చేస్తూ ఉంటే మొటిమలు,మొటిమల మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.
కొంచెం కర్పూరం ఆయిల్ తీసుకుని, అంతే మోతాదులో కొబ్బరి నూనెను తీసుకోని రెండింటిని మిక్స్ చేయాలి.ఈ రెండూ వేడి చేసి తలకు రాసి వేడి నీటిలో డిప్ చేసి టవల్ ను తలకు చుట్టాలి.
ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.ఈ విధంగా చేయటం వలన తలలో పొడితనం,దురద తగ్గిపోతాయి.
చుండ్రును తగ్గించటంలో అద్భుతంగా పనిచేస్తుంది.దీనిలో యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఇన్ఫలమేటరి లక్షణాలు ఉండుట వలన చుండ్రును సమర్ధవంతంగా తగ్గిస్తుంది.కర్పూరం నూనెను షాంపు మరియు కండీషనర్ లో కలిపి ఉపయోగించుకోవచ్చు.