పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పెట్టిన పార్టీ జనసేన జనంలోకి వచ్చేది అంటే ఎన్నికల్లో పోటీ చేసేది 2019 ఎన్నికల్లోనే.ఈ విషయం పవన్ కళ్యాన్ స్వయంగా చెప్పాడు.
విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన పవర్ స్టార్ వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతామని మీడియాకు చెప్పాడు.వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ఈ మధ్య వార్తలు వచ్చాయి.
కాని పవన్ కళ్యాన్ హైదరాబాద్ ఎన్నికల మీద క్లారిటీ ఇచ్చేశాడు.హైదరాబాద్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేక పోతున్నారంటే డబ్బు లేని కారణంగా బరిలోకి దిగే సాహసం చేయడంలేదని చెప్పాడు.
జనసేన అరంగేట్రానికి హైదరాబాద్ ఎన్నికలు సరైన వేదిక కూడా కాదని అన్నాడు.హైదరాబాద్ ఎన్నికలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చలు జరపలేదని చెప్పాడు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీ -బీజేపీ కూటమికి మద్దతు ఇస్తారు.గత ఎన్నికల్లో చేసిన పని కూడా ఇదేకదా.
హైదరాబాద్ ఎన్నికల్లో పవన్ పార్టీతో కలిసి పోటీ చేస్తే ప్రయోజనం కలుగుతుందని, గులాబీ పార్టీని ఓడించడం సులభం అయ్యేదని పసుపు,కాషాయం పార్టీల నాయకులు భావించారు.వారిని నిరాశపరిచాడు పవన్.
హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆయనే సొంతంగా నిర్ణయించుకున్నారా? ఎవరైనా సలహా ఇచ్చారా? తెలియదు.







