భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) టోర్నీలో పాల్గొనేందుకు మిగిలి ఉన్న రెండు స్థానాల కోసం 10 జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా క్వాలిఫయర్ మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే.శ్రీలంక మరో మ్యాచ్ ఆడాల్సి ఉండగానే వన్డే వరల్డ్ కప్ టోర్నీకి అర్హత సాధించింది.
గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి పరాజయాలతో నేరుగా వరల్డ్ కప్ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది.క్వాలిఫయర్ మ్యాచ్లలో నాలుగు మ్యాచ్లలో గెలిచిన శ్రీలంక(Sri Lanka ) టేబుల్ టాపర్ గా నిలిచింది.
జింబాబ్వే, నెదర్లాండ్ జట్లపై గెలిచిన శ్రీలంక ఆడాల్సిన మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వరల్డ్ కప్ టోర్నీకి అర్హత సాధించింది.
తాజాగా జింబాబ్వే- శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 32.2 ఓవర్లకు అన్ని వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది.జింబాబ్వే బ్యాటర్లైన సీన్ విలియమ్స్ 56, సికిందర్ రజా 31, రియాన్ బర్ల్ 16, క్రెన్ ఎర్విన్ 14, జాంగ్వే 10, బ్రాడ్ ఇవన్స్ 14 చేయగా మిగిలిన బాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడంతో జింబాబ్వే భారీ స్కోరు చేయలేకపోయింది.
శ్రీలంక బౌలర్ మహీశ తీక్షణ 4 వికెట్లు, దిల్షాన్ మధుశనక 3 వికెట్లు, మతీశ పథిరాణా 2 వికెట్లు, దసున్ శనక 1 వికెట్ తీశారు.

స్వల్ప లక్ష్య చేదనకు శ్రీలంక 33.1 ఓవర్లకు కేవలం ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.శ్రీలంక బ్యాటర్లైన కరుణ రత్నే 30 పరుగులకు అవుట్ అవ్వగా.
పథుమ్ నిశ్శంక 101 పరుగులు, కుశాల్ మెండిస్ 25 పరుగులు చేసి శ్రీలంకకు విజయాన్ని అందించారు.

శ్రీలంక 1996 లో అంటే వరల్డ్ కప్ గెలిచింది.2007, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు చేరి రన్న రప్ తో సరిపెట్టుకుంది.క్రికెట్ నిపుణుల అంచనాల ప్రకారం శ్రీలంక, వెస్టిండీస్ జట్లు అర్హత సాధిస్తాయి అనుకున్నారు.
వెస్టిండీస్ జట్టు స్కాట్లాండ్, నెదర్లాండ్, జింబాబ్వే చేతులలో ఓడి పీకల్లోతు కష్టాలలో పడింది.మరి వెస్టిండీస్( West indies ) అర్హత సాధించాలంటే మిగిలి ఉన్న రెండు మ్యాచ్లలో ఓమన్, శ్రీలంక జట్లపై విజయం సాధించాలి.
అంతేకాకుండా జింబాబ్వే, స్కాట్లాండ్ చేతిలో ఓడిపోవాల్సి ఉంటుంది.అప్పుడే వెస్టిండీస్ కు వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధించే అవకాశాలు ఉంటాయి.







