సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది మంది డైరెక్టర్ లు వాళ్ళు తీసిన సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంటారు…ఇక సినిమా ల విషయం పక్కన పెడితే సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం అసాధ్యం కానీ కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని కారణాలవల్ల ఆస్తుల కోల్పోయిన వారి పరిస్థితి మరింత అద్వానంగా దిగజారుతూ ఉంటుంది.కొంతమంది దీపం ఉన్నట్టుగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటే.
మరి కొంత మంది ఆ సంపాదించిన డబ్బును కూడా కాపాడుకోలేక వందల కోట్లు కోల్పోతూ ఉంటారు.అలా ఆ క్రమంలోనే ప్రముఖ ఫ్యామిలీ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న దశరత్ కూడా అలాంటి తప్పు చేశాడని తెలుస్తొంది.
ప్రముఖ డైరెక్టర్ దశరథ్( Director Dasarath ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.నాగార్జునతో సంతోషం,( Santosham Movie ) రెబల్ స్టార్ ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్( Mr Perfect Movie ) వంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన ఎన్నో పదుల సంఖ్యలో చిత్రాలకు మంచి రైటర్ గా కూడా పనిచేసి పేరు దక్కించుకున్నారు.ఇకపోతే ఒకానొక సమయంలో ఆయన చేసిన తప్పిదమే 300 ఎకరాలను కోల్పోయేలా చేసిందని ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వెల్లడించారు…

అసలు విషయంలోకి వెళితే.తాను కొనుగోలు చేసిన భూమిలో చాలా భూమి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది అని ఇప్పుడు ఆ ప్రాంతాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని అయినా కూడా తమ పేరు మీదే ఆ ల్యాండ్ రిజిస్టర్ అయిందని వెల్లడించారు.ఇకపోతే అటవీశాఖ అధికారులు చేతిలో ఆ ల్యాండ్ ఉండడం వల్ల తాము సాగు చేయలేకపోతున్నామని.అలా 300 ఎకరాలను దాదాపు కోల్పోవాల్సి వచ్చింది అని దశరథ్ చెప్పుకొని బాధపడ్డారు…

ఎప్పటికైనా తమ భూమి తమకు తిరిగి వస్తుందన్న నమ్మకం ఉందని ఇక భూమి తిరిగి వస్తే సాగు చేస్తామని కూడా ఆయన వెల్లడించారు.మొత్తానికి అయితే దశరధ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.మరి ఆయన ఆశ మేరకు ఆ భూమి తిరిగి వస్తుందా లేదా అన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ మారింది…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆయన కొన్ని కొత్త సినిమాలు చేసే ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది
.