Bhumika Chawla : ఆ సినిమా చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.. భూమికా చావ్లా కామెంట్స్ వైరల్?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ భూమిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన భూమిక ఆ తర్వాత సినిమాలకు దూరంగా వెళ్లిన విషయం తెలిసిందే.

 Bhumika Chawla I Felt Bad When I Signed Jab We Met And It Did Not Happen-TeluguStop.com

భూమిక పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ఖుషి.ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది భూమిక చావ్లా.

ఖుషి( Kushi ) సినిమాలో నడుము సీన్ ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేదు.అప్పట్లో ఒక్కడు, ఖుషి, సింహాద్రి, అనసూయ, వాసు, సాంబ లాంటి సినిమాలలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

ఇకపోతే ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన భూమిక( Bhumika Chawla ) సినిమాలలో హీరో హీరోయిన్ లకు అక్క లేదా చెల్లి పాత్రల్లో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతోంది.

ఇప్పటికే ఈమె ఎంసీఏ, సీతారామం, సిటీమార్, పాగల్ లాంటి సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భూమిక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

హిందీలో నా మొదటి సినిమా తేరే నామ్( Tere Naam ).ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటించారు.

ఈ సినిమా హిట్ కావడంతో నాకు హీరోయిన్గా మంచి మంచి అవకాశాలు వచ్చాయి.మామూలుగా నేను సినిమాలను ఆచితూచి ఒప్పుకుంటాను.తేరే నామ్ సినిమా తర్వాత నాకు ఒక పెద్ద సినిమా అవకాశం రావడంతో ఓకే చేసేసాను.సడన్గా నిర్మాతలు మారడంతో హీరోను నన్ను మార్చేశారు.సినిమా టైటిల్ కూడా చేంజ్ చేశారు.ఒకవేళ ఆ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఇంకొక విధంగా ఉండేదేమో.

అందుకే ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది అనుకున్నాను.ఆ సినిమా కోసం మరే ఇతర సినిమాలు ఒప్పుకోకుండా దాదాపు ఏడాది పాటు ఎదురు చూసాను కానీ చివరికి నిరాశ ఎదురయ్యింది.

దాంతో వేరే సినిమాలకు ఓకే చేశాను అని చెప్పుకొచ్చింది భూమిక.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube