తెలంగాణ బీజేపీ రోజురోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.మొదటి నుండి బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతో ప్రజల్లో పలుచన కావడమే కాకుండా నేతల బహిరంగ విమర్శలతో కాంగ్రెస్ కాస్త బలహీనపడటంతో ఇక బీజేపీ చాలా తీవ్ర స్థాయిలో కేసీఆర్ పై విరుచుకపడుతూ రకరకాల కార్యాచరణలు చేపడుతూ ప్రజల్లో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అనే ఆలోచన కలగాలనే బలమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.
అయితే కేసీఆర్ ప్రెస్ మీట్ ద్వారా బీజేపీ ఒక్కసారిగా అంతర్మధనంలో పడింది.దీంతో బీజేపీలో అలజడి అనేది కరువైంది.
కేసీఆర్ ప్రెస్ మీట్ ముందు వరకు ఇటు జీవో 317 పై దీక్షలు చేసి టీఆర్ఎస్ పై సృష్టించిన వ్యతిరేక వాతావరణం అంతా ఒక్కసారిగా పోవడంతో పాటు జీవో 317 పై చేసిన ప్రచారం కేసీఆర్ ఇచ్చిన వివరణతో నిరుద్యోగులు పెద్ద ఎత్తున సంతృప్తి చెందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే బీజేపీ ఇక మరల కెసీఆర్ టార్గెట్ గానే వ్యాఖ్యలు చేస్తారా లేక ఏదైనా ప్రత్యేక ఎజెండాతో ముందుకు వెళ్తారా అనేది ఇప్పుడే స్పష్టంగా మనం చెప్పలేకపోయినప్పటికీ బీజేపీకి చెక్ పెట్టేలా ఇప్పటికే పకడ్భందీగా ప్రణాళికలు రచిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే బీజేపీ శిబిరంలో మాత్రం కొంత తాజాగా జరిగిన ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రెస్ మీట్ తరువాత బీజేపీకి రాష్ట్రంలో కావచ్చు, నిరుద్యోగులలో వ్యతిరేక పవనాలు వీస్తున్న పరిస్థితిలలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎలా మారుతుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.అయితే జీవో 317 విషయంలో ఇచ్చిన క్లారిటీతో చాలా వరకు బీజేపీ పార్టీ రాజకీయ వ్యూహం బెడిసి కొట్టిన పరిస్థితిలలో ఇంకా భవిష్యత్తులో కెసీఆర్ వ్యూహంలో పడకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది.