చెట్లు నరికే సమయంలో గర్భిణీలు చూడకూడదా?

గర్భిణీలుగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని పనులు చేయవద్దని పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు.అందులో సూర్యగ్రహణం చూడవద్దని అంటారు పండితులు.

 Is Pregnant Women Don’t See While Deforesting, Devotional, Garbhini Niyamalu,-TeluguStop.com

సూర్యాగ్రహణం సమయంలో నెగెటివ్ ఎనర్జీ వస్తుందని… దాని వల్ల గర్భంలోని శిశువుకు చెడు జరుగుతుందని భావిస్తారు.అలాగే ఆ సమయంలో ఏదీ తినకూడదని అందరూ అనే మాట.ఇలా తినడం వల్ల పుట్ట బోయే పిల్లలు శారీరక లేదా మానసిక అంగ వైకల్యంగా పుడతారని చెబుతారు.

అలాగే చెట్లు నరికే సమయంలో గర్భంతో ఉన్న మహిళలు చూడకూడదని శాస్త్రం చెబుతోంది.

దీనికి వివరణ కూడా ఇస్తున్నాయి శాస్త్రాలు.చెట్టు కొట్టే సమయంలో ఆ పరిసరాల్లో గాని గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు ఒక వేళ ఆ చెట్టు విరిగి కింద పడే సమయంలో పరిగెత్త లేక పోవడమే కాక ఆ ప్రమాదం నుండి తమకు తాముగా తప్పించుకోలేరు.

ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే అటు తల్లితో పాటు గర్భంలో ఉన్న శిశువుకు ప్రాణాపాయం ఉంటుంది.అలాగే మరో కారణం ఏమిటి అంటే చెట్టు విరిగి కింద పడే సమయంలో వచ్చే శబ్దం చాలా భయంకరంగా ఉంటంది.

 ఈ శబ్దం గర్భంలోని శిశువు గుండె మరియు మెదడు పై శాశ్వతమైన చెడు ప్రభావాన్ని కలిగించే అవకాశం ఉంది.కాబట్టి నేటి వైద్యులు కూడా గర్భిణీ మహిళలను విస్ఫోటనా శబ్ధాలను, పెద్ద శబ్ధాలను వినకుండా ఉండమనే చెబుతారు.

అందుకే గర్భిణీలు చెట్లు నరికేటప్పుడు అస్సలే చూడకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube