నదిలో ఇబ్బందులు పడుతున్న శివ భక్తులు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో సిద్దేశ్వరం, సోమశిల ప్రాంతాలలో నెలకొన్న ఘాట్ బోట్ల పంచాయతీ శివ స్వాముల పై తీవ్ర ప్రభావం చూపుతుంది.మహాశివరాత్రి మహోత్సవాలకు పుష్కరించుకొని తెలంగాణ ప్రాంతంలోని కొల్లాపూర్, పెంటవెల్లి, నాగర్ కర్నూల్, వనపర్తి తదితర ప్రాంతాలకు చెందిన శివ స్వాములు, భక్తులు, సంఘమేశ్వర క్షేత్రాన్ని దర్శించుకుని కాలినడకన శ్రీశైలం వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

 Shiva Devotees In Trouble In The River , Siddeswaram, Somashila, Shiva Devotees-TeluguStop.com
Telugu Bakthi, Bakti, Devotional, Kolhapur, Nagar Kurnool, Pentavelli, Shiva Dev

అనుకున్నట్లుగానే వారంతా సోమశిల చేరుకున్నారు.అయితే నెల క్రితం నుంచి కృష్ణ నది పై ఘాట్ బోట్ల రవాణా ను జిల్లా అధికారులు నిషేధించారు.అప్పటి నుంచి నేటి వరకు నది లో ఎలాంటి బొట్లు తిరగడం లేదు.తెలంగాణకు చెందిన ఘాట్ బోట్ల నిర్వాహకులు మాత్రం అక్కడి అధికారులు, రాజకీయ నాయకుల పలుకుబడితో వారి సరిహద్దుతో పాటు సంగమేశ్వరం, మల్లేశ్వరం, సోమశిల ఇటు ముచ్చుమర్రికి మధ్యన ఉన్న మినీ ఐలాండ్ కు పర్యాటకులను చేరవేస్తూనే ఉన్నారు.

ఈ విషయం తెలుసుకుని శివ స్వాములు బోటు దాటేందుకు వచ్చారు.కానీ ఘాట్ బోటు నిర్వాహకులు శివ స్వాములను, పర్యటకులను, భక్తులను బొట్లలో ఎక్కించుకొని మినీ ఐలాండ్ చూపించి అక్కడే వదిలేసారు.

సంగమేశ్వరం గాని, సిద్దేశ్వరం గాని వెళ్ళిందుకు తమకు అనుమతి లేదని అక్కడివారు వచ్చి తీసుకెళ్తారని చెప్పడంతో శివ స్వాములు, భక్తులు, పర్యాటకులు షాక్ కి గురయ్యారు.

Telugu Bakthi, Bakti, Devotional, Kolhapur, Nagar Kurnool, Pentavelli, Shiva Dev

చేసేదేమీ లేక బోట్ల ద్వారా మళ్ళీ సోమశిలకు వెళ్లిపోయారు.అయితే నెల రోజుల క్రితం నుంచి ఘాట్ బోట్ల రాకపోకలను నిషేధించిన ఏపీకి చెందిన నంద్యాల జిల్లా అధికారులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అసలు చూపలేదు.దీంతో నెల రోజులుగా భక్తులతో పాటు ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు, భక్తులు, పర్యాటకులు పడుతున్న ఇబ్బందులు ఆ శివుడికి తెలియాలి అన్నట్లు ఉంది పరిస్థితి.

అందువల్ల అధికారులు స్పందించి ఘాట్ బోట్ల నిర్వహణ పై చర్యలు తీసుకొని ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయా రాష్ట్రాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube