ప్రియుడి కోసం భర్తను హతమార్చిన భార్య.. అనాథలైన పిల్లలు..!

ప్రస్తుత సమాజంలో రోజురోజుకు మానవత్వం, అనుబంధాలు దిగజారిపోతున్నాయి.మనుషులు ఏం చేస్తున్నారో,ఎటువంటి పరిస్థితులలో బతుకుతున్నారో మరిచిపోయి ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు.

 Wife Killed Husband With The Help Of Boy Friend In Karnataka Mysore Details, Wif-TeluguStop.com

వివాహం కాకముందు అయితే పర్వాలేదు, కానీ వివాహ బంధంతో ఒకటైన తర్వాత భార్యాభర్తల మధ్య ఉండే బంధానికి ఇద్దరు కట్టుబడి ఉండాలి.అప్పుడే భార్యాభర్తల మధ్య సంసారం సంతోషంగా ఉంటుంది.

అయితే వివాహం చేసుకొని 12 సంవత్సరాల సుదీర్ఘ కాపురం తరువాత ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తనే హతమార్చిన సంఘటన కర్ణాటకలోని మైసూర్ లో చోటు చేసుకుంది.మైసూర్ కు చెందిన లిఖితకు, హోటగల్లికి చెందిన మంజుతో వివాహం జరిగి 12 సంవత్సరాలు అయ్యింది.

వీరికి ఇద్దరు పిల్లలు.

Telugu Boy Friend, Relationship, Karnataka, Likhita, Manju, Mysore, Kills-Genera

సంసారం హాయిగా సాగే క్రమంలో లిఖితకు ఒక వ్యక్తి పరిచయం అవడంతో అతని మోజులో పడి భర్త, పిల్లలను వదిలేసి వెళ్ళిపోతే ఆమె తండ్రితండ్రులు నచ్చజెప్పి గ్రామ పెద్దల వద్ద పంచాయతీ చేసి మంజు,లిఖితను ఒకటి చేశారు.కొంతకాలం లిఖిత సక్రమంగానే ఉంది.తర్వాత మళ్లీ తన ప్రియుడిని కలవడం కొనసాగించడంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవి.

ఇక తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హతమార్చాలని ప్రియుడుతో కలిసి ప్లాన్ వేసింది.మంగళవారం రాత్రి భర్త నిద్రిస్తున్న సమయంలో ప్రియుడితో కలిసి భర్త గొంతును గట్టిగా బిగించి చంపేసింది.

Telugu Boy Friend, Relationship, Karnataka, Likhita, Manju, Mysore, Kills-Genera

భర్తను హతమార్చిన విషయం బయటపడకుండా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసినా కూడా భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా లిఖితపై అనుమానంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.ప్రియుడి మోజులో పడి లిఖిత చేసిన తప్పు వల్ల అటు తండ్రిని కోల్పోయి, ఇటు తల్లి జైలు కు వెళ్లడం వల్ల ఆ ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.కేవలం శారీరక సుఖం కోసం కన్నబిడ్డల జీవితం నాశనం చేసింది లిఖిత.

ప్రియుడు కోసం లిఖిత చేసిన పనిపై బంధువులు, చుట్టుపక్కల వారు మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube