ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువకు పడిపోతున్నాయి.ఈ చలికాలంలో వాటర్ మరింత చల్లగా మారుతుండటంతో జనాలు ఉదయాన్నే వాటిని వాడలేకపోతున్నారు.
అన్ని అవసరాలకు వేడి చేసుకొని మరీ నీళ్లు వాడుతున్నారు.ప్రతి అవసరానికి నీళ్లు వేడి చేసుకోవడానికి చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు.
అయితే పదేపదే నీళ్లు వేడి చేసుకోకుండా ఒకేసారి వాటర్ ట్యాంక్ మొత్తం వేడి చేయాలనే ఆలోచనను ఓ యువకుడు చేశాడు.

అతడు చేసిన ప్రయోగం చాలా వింతగా ఉంది.దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో( Social media ) ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇంతకీ అతను చేసిన ప్రయోగం ఏంటంటే, మొదటగా ఈ యువకుడు టెర్రస్ మీద ఉన్న వాటర్ ట్యాంక్‌కు ( Water tank )ఒక రంధ్రం చేశాడు.
అందులో హీటర్ సెట్ చేసి దానికి పవర్ సప్లై ఇచ్చాడు, అంతే నీళ్లు వేడి అయిపోవడానికి రెడీ అయ్యాయి.

వైరల్ అవుతున్న వీడియోలో ( Viral video )సదరు యువకుడు అపోలో వాటర్ ట్యాంక్‌కి బొక్క పెట్టి అందులో హీటర్ ఉంచి తర్వాత వాటర్ లీక్ కాకుండా రబ్బర్ సెట్ చేయడం మనం చూడవచ్చు.ఆపై నట్స్ బిగించిన అనంతరం ఆ యువకుడు అందులో నిల్చోని కనిపించాడు.అయితే ఈ ప్రయోగం సురక్షితమైనదా? లేదంటే నేరుగా యమలోకానికే పంపిస్తుందా అనేది మాత్రం తెలియ రాలేదు.అంత పెద్ద ట్యాంక్ వాటర్ వేడి చేయాలంటే అంత చిన్న హీటర్( Heater ) సరిపోతుందా అని మరి కొందరు సందేహం వ్యక్తం చేశారు.ఇంకొందరు కరెంట్ బిల్లు వాచిపోతుందని ఫన్నీగా వ్యాఖ్యానించారు.
మొత్తం మీద ఈ ప్రయోగం చాలామంది దృష్టిని ఆకట్టుకుంది.ఈ వీడియోను j_a_n_u_rajbhar అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ షేర్ చేయగా లక్షల్లో వ్యూస్ వచ్చాయి.
దీనిపై మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.







