అర్జునుడిగా నటించిన మెగాస్టార్ సినిమా ఇదే..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలో నటించారు.ఇక ఆయన చేసిన సినిమాల్లో దాదాపు అన్ని సాంఘిక చిత్రాలే ఎక్కవగా ఉన్నాయి.

 Here Is The Unknown Facts About Chiranjeevi, Tollywood , Chiranjeevi , Unknown F-TeluguStop.com

చిరంజీవి కెరీర్ మొత్తంలో చూస్తే.శ్రీ మంజునాథ సినిమాలో మాత్రమే పౌరాణిక సినిమా గా చెప్పొచ్చు.

ఇక ఆ సినిమాలో మెగాస్టార్ శివుడి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.అయితే దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు శివతత్వాన్ని ప్రతిపాదిస్తూ తీసిన ఈ చిత్రంలో చిరంజీవి శ్రీమంజునాథుడైన శివుడి పాత్రలో అద్భుత అభినయంతో సెహబాష్ అనిపించుకున్నారు చిరంజీవి.

ఇక అటు జానపద సినిమా విషయానికొస్తే శివుడు శివుడు శివుడు సినిమాను కాస్త రాజుల కాలం నాటి జానపద సినిమా అని చెప్పడంలో సందేహం లేదు.అయితే ఇన్నేళ్ల కెరీర్‌లో తొలిసారి చారిత్రక యోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

కాగా.

Telugu Chiranjeevi, Manjunadha, Raghvedra Rao, Rowdy, Tollywood-Movie

చిరంజీవి తన సినీ జీవితంలో రామాయణం, మహాభారతంలోని ఏ పాత్ర పోషించే అవకాశం ఎప్పడు రాలేదు.ఆయన చేయలేదు.అయితే చిరంజీవి భవిష్యత్తులో రామాయణం, మహాభారతంలోని ఏదైనా పాత్ర పోషిస్తే.

చూడాలనుకునే అభిమానులు చాలామంది అనుకుంటున్నారు.

Telugu Chiranjeevi, Manjunadha, Raghvedra Rao, Rowdy, Tollywood-Movie

అంతేకాదు.ఓ సినిమాలో భాగంగా అర్జునుడి వేషం వేసి మెప్పించాడని చాలామందికి తెలియదు.అదేంటంటే టి సుబ్బరామిరెడ్డి ప్రొడ్యూసర్ గా తీసిన భారీ మూవీ స్టేట్ రౌడ ని బి.గోపాల్ డైరెక్ట్ చేశారు.ఇక అందులో గయోపాఖ్యానం ఉంది.

అయితే అందులో చిరంజీవి అర్జునుడి వేషం వేస్తే.నూతన్ ప్రసాద్ శ్రీకృష్ణుడిగా, ఇక గయుడి పాత్రలో రావు గోపాల రావు నటించారు.

అయితే కేవలం ఐదు నిమిషాల సన్నివేశం అద్బుతంగా ఆకట్టుకున్నారు.అంతేకాదు అర్జునుడి వేషంలో ఆగికంగా కానీ వాచకంగా కానీ మెగాస్టార్ అద్భుతాభినయం చేసాడని చెప్పాలి మరి.ఇక ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube