టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ శ్రద్ధా కపూర్(Shreddha Kapoor) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఈమెకు ఆశించిన స్థాయిలో మాత్రం గుర్తింపు దక్కలేదు.
ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు విడుదల అయ్యి చాలా రోజులు అవుతోంది.అందుకు గల కారణం కూడా లేకపోలేదు.
పారితోషి కం విషయంలో ఈమె చాలా వరకు మూవీ ఆఫర్లను మిస్ అవుతున్నట్టు తెలుస్తోంది.
దాంతో ఎవరు ఏ సినిమా కోసం అడిగినా భారీ రేట్లు కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.పుష్ప 2(Pushpa 2) సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అడిగితే ఎనిమిది కోట్లు అడిగినట్లు వార్తలు వినిపించాయి.దాంతో నిర్మాతలు వెనకడుగు వేసి రెండు కోట్లు ఇచ్చి శ్రీలీలతో(Srileela) అదే పాట చేయించుకున్నారు.
ఇది ఇలా ఉంటే ఇప్పుడు మరో చాన్స్ కూడా శ్రద్ద కపూర్ వదులుకున్నట్లు తెలుస్తోంది.నాని హీరోగా సుధాకర్ చెరుకూరి(Nani as the hero, Sudhakar Cherukuri) నిర్మించే శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) సినిమా కోసం శ్రద్ద కపూర్ ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట.
కానీ దానికి ఆమె చెప్పిన రెమ్యూనిరేషన్ విన్నాక మారు మాట్లాడలేదని తెలుస్తోంది.ఇప్పుడు కొత్త హీరోయిన్ ను ఎవరైనా తీసుకోవాలని చూస్తున్నారట.
శ్రద్ధా కపూర్ రెండు అంకెల కోట్ల మేరకు అడిగినట్లు తెలుస్తోంది.అందుకే వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది.నిజానికి శ్రద్ద మంచి చాన్స్ వదలుకున్నట్లే.నాని పక్కన చేసిన మృణాళ్ (Mrinal)కు తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి.శ్రద్ద కూడా తెలుగులో కొన్నాళ్ల పాటు మంచి సినిమాలు చేసే అవకాశం వుండేది.కానీ ఇంత రేట్ కోట్ చేసారు అని తెలిసిన తరువాత మరే నిర్మాత కాంటాక్ట్ లోకి వెళ్లే అవకాశం తక్కువ.
మరి ఇప్పటికైనా కొంచెం వెనక్కి తగ్గి రెమినరేషన్ ను తగ్గించుకుని సినిమాలు చేస్తుందా లేదా చూడాలి మరి.